ETV Bharat / state

'శ్రీ రామ' నామ స్మరణతో మార్మోగిన 'అంజన్న' క్షేత్రం - 'శ్రీ రామ' నామ స్మరణతో మార్మోగిన 'అంజన్న' క్షేత్రం

శ్రీరామ... జయ రామ... జయ జయ రామ అంటూ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు రామ నామ స్మరణతో  మార్మోగింది..  హనుమాన్‌ జయంతిని పురస్కరించుని తరలి వచ్చిన దీక్షా పరులతో ఆలయ ప్రాంగణం కాషాయమయైంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భక్తులు హనుమంతుడి ముందు తమ కోరికల చిట్టా విప్పారు.

hanuman jayanti in kondagattu
author img

By

Published : May 29, 2019, 11:04 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఈరోజు హనుమాన్​ జయంతిని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇరుముడితో వచ్చిన మాలధారులు అంజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకుని దీక్షా విరమణ చేస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

శ్రీరామ నామ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు

పటిష్ఠ భద్రత

పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 450 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సింధూ శర్మ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈరోజు రద్దీ మరింత పెరగనున్నందున భద్రత పటిష్ఠం చేశామని తెలిపారు.

ఇదీ చూడండి:ఓటమిపై ఆవేశం.. నాయకుల తీరుపై ఆగ్రహం!

Intro:.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.