ETV Bharat / state

రేషన్​ డీలర్లను తొలగించం.. స్టాకర్లుగా వాళ్లే.. - assembly

కేవలం రేషన్ బియ్యం అవసరమైన వారికి ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సభకు వివరించారు. 30 వేల మంది రేషన్​ డీలర్లను తొలగిస్తారంటూ తెదేపా అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం జగన్‌.. ఉపాధి కల్పిస్తారే కానీ.. ఎవరి పొట్టకొట్టే పని చేయరు అని తెలిపారు.

సభలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని
author img

By

Published : Jul 22, 2019, 10:48 AM IST

Updated : Jul 22, 2019, 12:05 PM IST

సభలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని

రేషన్‌ డీలర్లను తొలగించే ప్రతిపాదనే లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తెదేపా హయాంలో అక్రమంగా నియమించిన డీలర్లు మినహా ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. తెలుగుదేశం పార్టీ రేషన్‌ దుకాణాలపైనే నడిచిందని.. పార్టీ నడపడానికి తెదేపా నేతలు రేషన్‌ డీలర్ల వద్ద వసూళ్లు చేశారు అని అన్నారు. 30 వేల మందిని తొలగిస్తారంటూ తెదేపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని.. సీఎం జగన్‌.. ఉపాధి కల్పిస్తారే కానీ.. ఎవరి పొట్టకొట్టే పని చేయరు అని తెలిపారు. అడ్డదారుల్లో వచ్చిన డీలర్లు పోతారు తప్ప.. నిజాయితీగా ఉన్నవాళ్లకు ఎలాంటి భయం లేదన్నారు. లబ్దిదారుల రేషన్‌ కార్డులు తమ వద్ద అట్టిపెట్టుకున్న డీలర్లు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేస్తే కేసులు లేకుండా చేస్తామన్నారు. రేషన్​ డీలర్లను స్టాకర్లుగా మారుస్తామన్నారు.

కేవలం రేషన్ బియ్యం అవసరమైన వారికి ప్రత్యేక కార్డులు జారీ చేయాలనే ప్రతిపాదన ఉందని... గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి రాగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పౌర సరఫరాల శాఖలో అవినీతికి తావులేకుండా చేస్తామని కొడాలి నాని అన్నారు.

ఇదీ చదవండి

రైతన్న గట్టిగా అనుకున్నాడు.. ఇంజినీర్ అయిపోయాడు!

Intro:

Body:Ap-tpt-76-22-Adhu dhati padhuna lekha-avb-Ap10102

చిత్తూరు జిల్లాలో నీ పడమటి మండలాల్లో ఖరీఫ్ సాగుకు దాటిపోయినా వర్షాల జాడ లేదు ముఖ్యంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం వర్షాధార మెట్ట సేద్యం వేరుశనగ సాగు 39 వేల ఎకరాలు జూన్ ఇరవై రెండు నాటికి విత్తనాలు వేసింది 5 వేల హెక్టార్లు మాత్రమే ఇంకా 34 వేల హెక్టార్లలో సాగుకు నోచుకోని బీడు భూమి ఈ ప్రాంతంలో ఎటుచూసినా కనిపిస్తుంది. కొందరు రైతులు దుక్కులు చేసి వర్షం కోసం దిక్కులు చూస్తుండగా, మరి కొందరు రైతులు దుక్కులు చేయడానికి కూడా వర్షాలు లేక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక వర్షాలు పడిన ఖరీఫ్ సేద్యానికి ప్రయోజనం ఏమీ ఉండదని భావించిన కొందరు రైతులు సట్టా బుట్టా సర్దుకుని వలసబాట పడుతున్నారు. నియోజకవర్గంలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం,పి టి ఎం, ములకలచెరువు, మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఎటు చూసినా నీళ్లు లేని సాగునీటి వనరులు అయిన చెరువులు, కుంటలు, వాగులు ,వంకలు,
చెక్ డ్యాములు ఖాళీగా కనిపిస్తున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎనిమిది వందల 97 డు చెరువులు కుంటలు, మరో పది జలాశయాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ చుక్కనీరు లేదు. ఇప్పటికే నిండుగా జలంతో జల జల కలకల తో ఉండాల్సిన సాగునీటి వనరులు ఒట్టి పోయి ఉండడంతో రబీలో కూడా నీటి కొరత ఏర్పడుతుందని ఈ ప్రాంత రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన పదేళ్లుగా ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో ఈ ప్రాంత రైతాంగం తరచు వలస బాట పడుతున్నారు. హంద్రీ-నీవా కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తే నే ఈ ప్రాంత రైతాంగానికి కరువు నుంచి కొత్త విముక్తి కలుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

Av -1,2,3,4 yaddhulavarikota mahila Raithulu
Av_ siva sankar -Ad, vyavasayashakha
Av-viswanath khareef Raithu
Av-LakshmiReddy khareef Raithu

R.sivaReddy kit no 863 tbpl
8008574616

Conclusion:
Last Updated : Jul 22, 2019, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.