ETV Bharat / state

'మేము అడిగినందుకే.. ప్రజావేదికను కూల్చేస్తున్నారు'

ప్రజావేదికను కూల్చివేయటాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. ప్రజల అవసరాలకోసం నిర్మించిన ప్రజావేదికను... ప్రభుత్వం అక్రమ కట్టడం అనటం సమంజసం కాదన్నారు. ఈ విషయంపై చర్చించడానికి అధినేత చంద్రబాబు నివాసంలో తెదేపా నేతలు సమావేశమయ్యారు.

'మేమడిగినందుకే..ప్రజావేదినకను కూల్చేస్తున్నారు'
author img

By

Published : Jun 24, 2019, 5:44 PM IST

అమరావతిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ అగ్ర నేతలు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రజావసరాల కోసం.. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామంటూ ప్రభుత్వం చెప్పడాన్ని నేతలు తప్పుపట్టారు. చట్ట ప్రకారం, తగిన అనుమతులతోనే ప్రజావేదికను నిర్మించామన్నారు. అక్రమ కట్టడమైతే కలెక్టర్ల సదస్సు ఎందుకు నిర్వహించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలనుంచి వినతులను స్వీకరించేందేందుక ప్రతిపక్షనేత ప్రజావేదిక కావాలని అడిగారని గుర్తుచేశారు. తమకు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని హెచ్చరించారు.

దాడులను ఖండిచిన నేతలు

వైకాపా శ్రేణుల ఆగడాలు శృతిమించాయని తెదేపా నేతలు వాపోయారు. తమ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో కార్యకర్తలపై భౌతిక దాడులను నేతలు ఖండించారు. వారి ఆగడాలపై డీజీపీని కలిసి మెమెురాండం ఇవ్వాలని నిర్ణయించారు.

యాంకర్ వాయిస్ = జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్ర రెండో రోజు వేంపల్లి కి చేరుకుంది.పాదయాత్రకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపిన వేంపల్లె మండల నాయకులు జగన్ పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమలకు పాదయాత్ర చేస్తున్నాను. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని సుధీర్ రెడ్డి ని కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే గా ప్రజలు గెలిపించినందుకు మన కడప జిల్లా మనిషి ఇ ముఖ్యమంత్రిగా ఉండడం మనకు చాలా గర్వ కారణం అని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం need జీవి గ్రామం నుండి మొక్కుబడిగా తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. సుధీర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర అ అ ఈరోజు వేంపల్లి కి చేరు కుంది దీంతో సుధీర్ రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్ర కు సంఘీభావంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేంపల్లి మండలాధ్యక్షుడు రవి కుమార్ రెడ్డి జెడ్ పి టి సి షబ్బీర్ వల్లి కన్వీనర్ చంద్ర ఓబుల్రెడ్డి మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులకు కు జగన్ పరిపాలనలో రాష్ట్రం సస్యశ్యామలం ఉండాలన్న ముఖ్య ఉద్దేశం తో తిరుమలకు పాదయాత్ర అ చేస్తున్నట్లు జమ్మలమడుగు నియోజక వర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.

బై టు - మూలే సుధీర్ రెడ్డి జమ్మలమడుగు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.