సరైన ప్రమాణాలు లేని పాఠశాల బస్సులను రేపటి నుండి సీజ్ చేస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. స్కూలు బస్సుల విషయంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. నిన్నటి నుంచి స్కూళ్లు తెరిచారని... బస్సు ఫిట్నెస్ పర్మిట్ తీసుకునేందుకు ఈ సాయంత్రం వరకే గడువు ఉందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల ప్రమాణాల విషయంలో గత ప్రభుత్వం చూసి చూడని విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇక నుంచి అది కుదరదని స్పష్టం చేశారు. స్కూల్ యాజమాన్యం ఏ పార్టీ వారైనా బస్సులు సరిగా లేకపోతే సీజ్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో విద్యా శాఖ, రవాణా శాఖ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటాయని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు సాయంత్రం వరకు గడువు: పేర్ని నాని - buses
విద్యార్థులను తరలించే బస్సులకు కచ్చితంగా ఫిట్నెస్ పర్మిట్లు ఉండాలని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఆదేశించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సరైన ప్రమాణాలు లేని పాఠశాల బస్సులను రేపటి నుండి సీజ్ చేస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. స్కూలు బస్సుల విషయంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. నిన్నటి నుంచి స్కూళ్లు తెరిచారని... బస్సు ఫిట్నెస్ పర్మిట్ తీసుకునేందుకు ఈ సాయంత్రం వరకే గడువు ఉందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల ప్రమాణాల విషయంలో గత ప్రభుత్వం చూసి చూడని విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇక నుంచి అది కుదరదని స్పష్టం చేశారు. స్కూల్ యాజమాన్యం ఏ పార్టీ వారైనా బస్సులు సరిగా లేకపోతే సీజ్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో విద్యా శాఖ, రవాణా శాఖ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటాయని తెలిపారు.
Body:చీని చెట్లు నరికివేత
Conclusion:అనంతపురం జిల్లా