ETV Bharat / state

మంత్రి సోమిరెడ్డి సమీక్షకు అధికారుల డుమ్మా!

వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సమీక్షకు అధికారులు హాజరవ్వాలన్న మంత్రి సూచనలు పెడచెవిన పెట్టారు.

మంత్రి సోమిరెడ్డి
author img

By

Published : Apr 30, 2019, 6:04 PM IST

Updated : May 1, 2019, 8:01 AM IST

రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవు అంశంపై వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమీక్షకు ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన ఏర్పాటు చేసిన ఈ సమీక్షకు హాజరు కావాల్సిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మురళీధర్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ సమీక్ష రాలేదు. రాష్ట్రంలోని కరవు, అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టంపై సమీక్ష నిర్వహించాలని మంత్రి సోమిరెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 24 తేదీనే ఉన్నతాధికారులకు మంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఇవాళ చిత్తూరు జిల్లాలో నిర్వహించే జిల్లా వ్యవసాయ సమీక్ష నేపథ్యంలో హాజరు కాలేమని ఉన్నతాధికారులు మురళీధర్ రెడ్డి, బి.రాజశేఖర్ మంత్రికి సమాచారం ఇచ్చారు. సచివాలయంలో 2 గంటలపాటు వేచి చూసిన మంత్రి వెనుతిరిగి వెళ్లిపోయారు.

ఇదీ చదవండి

మామిడి పండ్లకు కేరాఫ్ ఉలవపాడు.. కానీ..!

Intro:రానున్న విద్యా సంవత్సరం లో పాఠశాలల అవసరాలు మౌలిక వసతులపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు సూచించారు ఇందులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం ఈ ఓ శాంతారాం మాట్లాడుతూ పాఠశాలలకు తరగతి గదులు మధ్యాహ్న భోజనం తాగునీరు ఉపాధ్యాయులు తదితర అంశాలపై అవసరాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు ఈ నివేదిక అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు భవిష్యత్తులో పాఠశాల అవసరాలకు ఈ వార్షిక నివేదికలు తోడ్పడతాయని సూచించారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788
Last Updated : May 1, 2019, 8:01 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.