ETV Bharat / state

ఆర్పీ ఠాకూర్‌ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్‌ - dgp

రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి గౌతం సవాంగ్ ను డీజీపీగా నియమించింది. ఏసీబీ డైరెక్టర్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ..ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్ ను నియమించింది.

ఆర్పీ ఠాకూర్‌ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్‌
author img

By

Published : May 31, 2019, 2:47 AM IST

Updated : May 31, 2019, 4:38 AM IST

ఆర్పీ ఠాకూర్‌ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్‌
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ ను గురువారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్ ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్​ గా బదిలీ చేసింది.
ఏసీబీ డైరెక్టర్ బదిలీ..
అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వ బదిలీ చేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించింది. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్ గా కుమార్ విశ్వజిత్​ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

New Delhi, May 30 (ANI): Bharatiya Janata Party (BJP) leader Smriti Irani, who had wrested Amethi Lok Sabha seat from Congress president Rahul Gandhi, took oath as the union minister at Rashtrapati Bhavan in presence of President Ram Nath Kovind and Prime Minister Narendra Modi in the national capital.
Last Updated : May 31, 2019, 4:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.