ETV Bharat / state

"అవినీతికి తావివ్వకుండా.. ప్రాజెక్డులు పూర్తి చేస్తాం" - anil kumar

సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

సభలో మాట్లాడుతున్న అనిల్​ కుమార్​ యాదవ్​
author img

By

Published : Jul 18, 2019, 5:00 PM IST

సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ

సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరారు.

దీనిపై మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ... ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్​ ఫ్రెండ్: చంద్రబాబు

సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ

సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరారు.

దీనిపై మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ... ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్​ ఫ్రెండ్: చంద్రబాబు

Intro:Ap_tpt_51_18_dharna_at_school_avb_ap10105

మాకు బడి వద్దు మా పిల్లల ఆరోగ్యమే ముఖ్యం
* కోళ్ల ఫారం తో వ్యాపిస్తున్న దుర్గంధం
*పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు అంటూ తల్లిదండ్రుల ఆందోళనBody:మాకు బడి వద్దు మా పిల్లల ఆరోగ్యమే మాకు ముద్దు అంటూ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం రెంట కుంట్ల గ్రామంలోని ఆదర్శ పాఠశాల వద్ద గురువారం జరిగింది. వివరాల్లోకెళితే గంగవరం మండలం, రెంటకుంట్ల గ్రామం లో గల ఆదర్శ ప్రాధమిక పాఠశాలలో రెంటకుంట్ల, పాతురు, డ్రైవర్స్ కాలనీకి చెందిన సుమారు 150 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాలకు 50 అడుగుల దూరంలొనే ఓ వ్యక్తికి చెందిన కోళ్లఫారం ఉంది. ఈ కోళ్లఫారం నుండి వచ్చే దుర్వాసనతో పాటు చనిపోయిన కోళ్లను అక్కడే కాల్చడం... అక్కడే పూడ్చడం కారణంగా ఆ వాసనకు విద్యార్థులు వాంతులు చేసుకుంటున్నారని... ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్తున్నా పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు పేర్కొన్నారు. కోళ్లఫారం ఎత్తి వెయ్యాలని లేదంటే మా పిల్లలని మేము ఇంటికి తీసుకొని వెళ్తాము అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలను అయినా వేరే చోటకి తరలించండి లేదంటే కోళ్ల ఫారంను అయినా వేరే చోటికి తరలించండి అంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు అని... అందువల్లే ఈ రోజు స్థానిక స్కూల్ నందు మాకు చదువులు వద్దు మా పిల్లల ఆరోగ్యం ముఖ్యం అని అని ధర్నా నిర్వహిస్తున్నా మంటూ పేర్కొన్నారు ఇదే విషయం గా మండల పరిధిలోని ఎంఈవో శాంతకుమారి కు, గంగవరం ఎస్ ఐ, తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు. అలాగే కోళ్ల ఫారం సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించబోమని తెలిపారు.Conclusion:ఈ విషయంగా ఎంఈవో శాంత కుమారి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శికి విషయం తెలిపామని ఈరోజు సాయంత్రం లోపు కోళ్ల ఫారం నిర్వాహకులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని లేనిపక్షంలో రేపు నోటీసు ఇస్తామని తెలిపారు.

రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.