ఉగాది వేడుకలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని తెలుగు అసోసియేషన్ లక్నోలో ఘనంగా నిర్వహించింది. నగరంలోని గోమతి నగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు వారందరూ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఐఏఎస్ అధికారులు రామిరెడ్డి, జితేంద్ర కుమార్, ఎన్నికల కమిషన్ చీఫ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సాయంత్రం వేళ.. వరంగల్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ తెలుగు సంస్కృతిని చాటారు. కూచిపూడి నృత్యాలతో పాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
లక్నోలో ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం పట్ల ఐఏఎస్ అధికారి రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఇలాగే నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నామని తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు అన్నారు.
మన సంస్కృతిని గుర్తు చేసేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం పట్ల స్థానిక తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్ పాట