ప్రియాతి ప్రియమైన మేఘానికి.. తెలుగు రాష్ట్రాల ప్రజల విన్నపము ఏమనగా!
మేఘమా నీ కోసం చంటి 'బిడ్డలు' బెంగ పెట్టుకున్నారు..
ముసలి వాళ్లు మంచం పట్టారు..
పుడమి 'తల్లి' పస్తులు ఉంటూ నీ రాకకై ఎదురుచూస్తోంది..
నిన్ను ఎంతగానో ప్రేమించే 'అన్న'దాత నీ కోసం కన్నీరు కారుస్తున్నాడు..
నీవు రావనే ధైర్యంతో సూర్యుడు మాపై నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు..
వాయుదేవుడు వేడిగాలులతో దాడులు సృష్టిస్తున్నాడు..
నీ మిత్రుడైన చెట్లను నరికేస్తున్నామని కోపంతో అలిగి వెళ్లిపోయావని మాకు తెలుసు..
మా తప్పును ఈసారికి క్షమించు...
మది మురిసేలా మరోసారి వర్షించు..
ఇకపై ఏ చెట్టును పెకిలించం... గొడ్డలి వేటు పడనివ్వం..
మేఘమా నీ కోసం పేపర్లలో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చాం..
ప్రతీ చోటా గాలిస్తున్నాం..
నీ కోసం ఏడ్చిఏడ్చి గొంతులు ఎండుతున్నాయి..
ఆశలు ఆవిరవుతున్నాయి..
ఇప్పటికైనా మమ్మల్ని పలకరించు..
కుంభవృష్టి కురిపించి కరుణించూ..
ఇట్లు
తెలుగు రాష్ట్రాల ప్రజలు