ETV Bharat / state

ఏపీ మానవహక్కుల సంఘం తొలి ఛైర్మన్‌ ఇకలేరు

author img

By

Published : May 1, 2019, 10:59 AM IST

Updated : May 1, 2019, 12:10 PM IST

జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి(76) అనారోగ్యంతో హైదరాబాద్​లో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి నెల రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చిక్సిత్స పొందారు.

ఏపీ మానవహక్కుల సంఘం తొలి ఛైర్మన్‌ ఇకలేరు
ఏపీ మానవహక్కుల సంఘం తొలి ఛైర్మన్‌ ఇకలేరు

జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ప్రస్థానం...
1943లో హైదరాబాద్​లోని బాగ్‌అంబర్‌పేటలో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జన్మించారు. 1991లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2001లో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా... 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్‌ మానవహక్కుల సంఘం తొలి ఛైర్మన్‌గా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా పనిచేసిన జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి... ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించారు.

ప్రముఖుల సంతాపం...
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైకాపా అధ్యక్షుడు జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. సుభాషణ్‌రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని... జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి మృతిపట్ల పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు...
సాయంత్రం మహాప్రస్థానంలో జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి...

తుదిశ్వాస విడిచిన నంద్యాల ఎంపీ

Intro:ap_vsp_76_01_eedutugalulaku_koolina_silveroak_coffee_miriyaalu

యాంకర్: విశాఖ మన్యంలో లో ఆకస్మిక గావించిన ఈదురు గాలులకు పలు గ్రామాల్లో సిల్వర్ ఓక్ చెట్లు నేలకొరిగాయి అంతరపంటలుగా ఉన్న కాఫీ మిరియాలు తోటలకు నష్టం ఏర్పడింది

వాయిస్: విశాఖ మన్య హుకుంపేట మండలం gadugu పల్లి లో కొండపై భారీ ఈదురు గాలులు వీచాయి దీంతో కాఫీ మిరియాల తోటలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లు కూలిపోయాయి మిరియాలు కాఫీ మీ ఆదాయం ఇచ్చే నీడ చెట్లు కూలి పడిపోయాయని ఆవేదన చెందుతున్నారు ఒక్క ఎకరం లో 10 చెట్లు చొప్పున పడిపోవడంతో మిరియాలు కాఫీ తోటల మొక్కలు లు సంవత్సరంలో వచ్చే వేలాది రూపాయలు ఆదాయం నష్టపోయామని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు

బైట్: పాంగి అప్పన్న, రైతు
శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
Last Updated : May 1, 2019, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.