ETV Bharat / state

జనసేనానికి లక్ష్మీనారాయణ తోడు - జేడీ లక్ష్మినారాయణ

ఐపీఎస్​గా ఎన్నో సంచలన కేసులు విచారించిన లక్ష్మీనారాయణకు... ఉద్యోగ బాధ్యతే ఇంటిపేరుగా మారింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఈయన... ప్రజాజీవితంలోకి వస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఏ పార్టీలో చేరేది చెప్పలేదు. ఇన్నాళ్ల ఉత్కంఠకు ఆదివారం ఉదయం తెరపడింది. పవన్ కల్యాణ్ ఆహ్వానంతో జనసేనలో చేరారు.

పవన్​తో జగన్
author img

By

Published : Mar 17, 2019, 8:34 PM IST

Updated : Mar 17, 2019, 11:21 PM IST

వి.వి.లక్ష్మినారాయణ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు... జేడీ లక్ష్మినారాయణ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇట్టే గుర్తుపట్టేస్తారు. కడప జిల్లాలో జన్మించిన లక్ష్మీనారాయణ... మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 2006 నుంచి 2015వరకు సీబీఐ వంటి అత్యున్నత నేర విచారణ సంస్థలో పనిచేసి నిజాయితీ గల అధికారిగా పేరుతెచ్చుకున్నారు.

దేశంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసు లక్ష్మీనారాయణనేతృత్వంలోనే దర్యాప్తు జరిగింది. రామలింగ రాజు, జగన్, గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసునూ విచారించింది ఈయనే. అనంతరం పూణె పోలీసు కమిషనర్​గా, మహారాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీ బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగా... ప్రభుత్వం ఆమోదించింది.

పదవీ విరమణ తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన ఈ మాజీ జేడీ... ఏ పార్టీలో చేరతారనేది చెప్పలేదు. కొత్త పార్టీ స్థాపిస్తారా లేక వేరే పార్టీలో చేరతారా అనే విషయంపై ఆసక్తి, ఉత్కఠ నెలకొన్నాయి. రాష్ట్రమంతా పర్యటిస్తూ... విద్యార్థులు, యువత, రైతులతో సమావేశాలు నిర్వహించారు. పలు పార్టీల నుంచి ఆహ్వానం అందినా... ఏ నిర్ణయం తీసుకోలేదు. లోక్​సత్తా ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు జయప్రకాష్ నారాయణ్ ముందుకొచ్చారు. ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి మంతనాలు జరపగా... తెదేపాలో చేరేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. జగన్​ను జైలుకు పంపటంలో కీలక పాత్ర పోషించినందున... వైకాపా నుంచి తీవ్ర విమర్శలు వస్తాయని చంద్రబాబు భావించారు. అందుకు తగ్గట్లే సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విమర్శలతో బాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్​తో ఉన్న సంబంధాలతో జనసేనలో చేరతారనే ప్రచారం జరిగినా... ఆహ్వానం రాలేదనే చొరవ చూపలేదని సన్నిహితులు అంటున్నారు. ముఖ్యనేతల సూచనలతో పార్టీలో చేరాలని మాజీ జేడీని పవన్ కోరగా... ఆధివారం ఉదయం విజయవాడ జనసేన కార్యాలయంలో కండువా కప్పుకున్నారు.
విశాఖపట్నం, కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు మాజీ జేడీ సన్నిహితులు పేర్కొంటున్నారు. కర్నూలు లేదా నంద్యాల నుంచి పోటీ చేయించాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. విద్యావంతులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రాష్ట్రాల ప్రజలు ఉండే విశాఖ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. పార్టీ అభ్యర్థుల తరఫున అధినేతకు తోడుగా ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారీ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి.

ఇదీ చదవండి

'బీఎస్పీకి తిరుపతి, బాపట్ల, చిత్తూరు'

Lucknow (Uttar Pradesh), Mar 16 (ANI): Ahead of Lok Sabha elections, Janata Dal (Secular) leader Danish Ali joined Bahujan Samaj Party (BSP) on Saturday. BSP senior leader Satish Mishra welcomed Ali and congratulated him on joining the party. Danish Ali said, "I was with JD(S) since its inception. I was not able to stand my party in Uttar Pradesh inspite being native of this place. My ideological connection is with weaker sections of the society, similar to that of Mayawati. Today is the time when Constitution is in danger. I want that all powers should concentrate to counter this threat."

Last Updated : Mar 17, 2019, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.