చౌకీదారులుగా చెప్పుకునే మోదీ ముందు ప్రజల సంపద, ప్రాణాలకు రక్షణ కల్పించాలనిఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని చాయ్ వాలాగానో, చౌకీదారుగానో ఎవరూ గుర్తించటం లేదన్నారు. జీఎస్టీ, నోట్లరద్దు వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని...ముస్లింలకు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.
జవానుల త్యాగం రాజకీయం చేస్తున్నారు...
పాకిస్తాన్‌పైదాడి చేశామని చెప్పుకుంటూ జవానుల త్యాగాలను సైతం భాజపా రాజకీయం చేస్తోందని అబ్దుల్లా మండిపడ్డారు. గొంతెత్తిన ప్రతిపక్షాలను ప్రభుత్వ వ్యవస్థల ద్వారా అణిచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనిఆరోపించారు. గతంలో వాజ్‌పేయీ సారథ్యంలో 23పార్టీలు కలిసి పనిచేశాయని గుర్తు చేశారు. ఇప్పుడుఅందుకు భిన్నమైన పరిస్థితి ఉందని విమర్శించారు.
ఇవీ చూడండి.