ETV Bharat / state

విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా: గవర్నర్‌

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసగించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యువత, మహిళలు, రైతుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వెల్లడించారు.

author img

By

Published : Jun 14, 2019, 9:44 AM IST

Updated : Jun 14, 2019, 11:14 AM IST

గవర్నర్

మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా గవర్నర్‌ ప్రసంగించారు. 'మా ప్రభుత్వం ప్రజా సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తాం. అవినీతిరహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం. దీనిలో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చాం. ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ చేపడుతాం' అని గవర్నర్ వెల్లడించారు.

గవర్నర్ ప్రసంగం

నవరత్నాల అమలు
మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు. విభజన సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. వైఎస్​ఆర్ రైతు భరోసా, వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పథకాల ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

యువత- ఉపాధి
రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్​ను ఏటా జనవరిలో ప్రకటిస్తామని వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విధానాల అమలకు రైతు కమిషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు గవర్నర్ నరసింహన్ తెలిపారు.

వ్యవసాయ రంగానికి తోడ్పాటు

రాష్ట్రవ్యాప్తంగా రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని గవర్నర్ తెలిపారు. రైతులకు పగటి పూట ఉచితంగా 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి సహా 2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

Intro:చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం లం పాలమంగళం వద్ద బావిలో పడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మధ్యప్రదేశ్ కు చెందిన ధర్మరాజు టార్చర్ చెన్నై నుంచి మహారాష్ట్రకు జెసిబి వాహనాన్ని లారీలో తరలిస్తుండగా పాలమంగళం వద్ద అదుపుతప్పి బావి లో పడింది ఈ సంఘటనలో లో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ నరేంద్ర తెలిపారు

Body:nagari

Conclusion:8008574570
Last Updated : Jun 14, 2019, 11:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.