విజయవాడ కమిషనరేట్ పరిధిలో సబ్ కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. దీనికి సంబంధిన భద్రతా ఏర్పాట్లను డీసీపీ అప్పలనాయుడు పరిశీలించారు. ఇప్పటికే ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. నగర శివార్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండంతో గుంటూరు జిల్లాలో అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీవీ ప్యాట్లు, ఈవీఎంల వినియోగంపై సిబ్బందికి ఉన్నతాధికారులు శిక్షణ ఇస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రకాశం జిల్లాలోని అన్ని కేంద్రాల అధికారులు, సహాయ పొలింగ్ అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం యాక్టీవేషన్, వాటిని ఏ విధంగా సీలు చేయాలి తదితర అంశాలపై జాగ్రత్తలు తెలియజేశారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటు యంత్రాలను ఏవిధంగా వినియోగించాలి, ఓటర్లతో ఏ విధంగా ప్రవర్తించాలనే అంశాలపై తర్ఫీదునిచ్చారు.
విశాఖ జిల్లాలో నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు స్థానిక డిగ్రీ కళాశాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్ రోజు అనుసరించాల్సిన నియమ నిబంధనలను డిజిటల్ తరగతులు ద్వారా వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి