ఓట్ల తొలగింపు వివాదం రోజురోజుకు ముదురుతోంది. రాష్ట్రంలో వందల కేసులు నమోదవుతున్నాయి. తొలగింపు కోసం చేసుకున్న దరఖాస్తులు అత్యధికం నకిలీవేనని ఎన్నికల సంఘం గుర్తించింది. ఓటర్లు ఆయా గ్రామాల్లోనే ఉన్నా...వారికి తెలియకుండానే మోసపూరితంగా ఎవరో...ఇలా నకిలీ దరఖాస్తులు పెట్టారని తేల్చింది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించాలంటూ క్రిమినల్ కేసులు పెట్టింది.స్థానికంగా ఆయా తహసీల్దార్ల ఫిర్యాదుల మేరకు ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఐపీసీ 120బీ, 419, 420, 465, 471 సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66, 66డీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 232 కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాల సమాచారం. తాజాగా భీమిలి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అంశంపై 111 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఏ ఐపీ చిరునామాల నుంచి దరఖాస్తులు చేశారు? ఎవరు చేశారనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 'ఫారం-7' కేసులు!
ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి మూక దాడులు లేవు. అలాగని అగ్రిగోల్డ్ లాంటి కుంభకోణాలు కావు. హీరా గ్రూప్స్ లాంటి గొలుసు కట్టు మాయలు జరగట్లేదు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా వందల్లో కేసులు నమోదవుతున్నాయి.