ETV Bharat / state

ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల ముందస్తు చర్యలు - డీజీపీ ఆర్పీ ఠాకూర్

ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఏర్పాట్లపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగేలా పోలీసు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పోలింగ్ సమయంలో దివ్యాంగులకు, మహిళలకు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలకు సిబ్బందిని సంసిద్ధం చేస్తున్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
author img

By

Published : Apr 8, 2019, 7:22 AM IST

ఈ మూడు రోజులు కీలకం: డీజీపీ ఆర్పీ ఠాకూర్
ఎన్నికల బందోబస్తుకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో సంప్రదించి అవసరమైన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలను డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆదేశించారు. తమిళనాడు నుంచి ఎక్స్ సర్వీస్​మెన్​లు రాష్ట్రంలో బందోబస్తు విధులకు రానున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 106కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. అలాగే బంగారం,ఇతర వస్తువులను మోడల్ కోడ్ తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 3వేల 309 కేసులు నమోదు చేశామన్నారు.
రానున్న మూడు రోజులు మోడల్ కోడ్ అమలుకు కీలకమైన సమయమనీ.. మరింత అప్రమత్తంగా ఉండి.. సాధారణ తనిఖీలు కాకుండా పూర్తి స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలని ఎస్పీలను డీజీపీ ఠాకూర్ ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు: సీఈవో ద్వివేది
ఈ నెల 11 పోలీంగ్ రోజున ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు,షామియానా, కుర్చీలు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లను సీఈవో గోపాలకష్ణ ద్వివేది ఆదేశించారు. వృద్ధులు,వికలాంగులు,గర్భిణీలు తదితర ఓటర్లు వారి ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు
అందరూ మొబైల్ ఆపరేటర్ స్టాండ్ బై జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామనీ చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనలు సోమవారం ఉదయంలోగా పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. 'మై ఓట్ క్యూ యాప్' పై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ద్వివేది సూచించారు. క్యూ లైన్లలో రద్దీని గమనించి ప్రతి ఒక్కరూ వారి ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీలో ఆర్ఓ, ఏఆర్ఓలు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల నిర్వహణకు ప్రైవేట్ సిబ్బందిని తీసుకోవద్దని ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు
పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై దృష్టి: డి. సాంబశివరావు
మద్యం విక్రయాలకు సంబంధించి ఈనెల 9వతేదీ ఉదయం 6గంటల నుంచి పోలింగ్ రోజైన 11వతేదీ సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి. సాంబశివరావు ప్రకటించారు. దీన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఇవీ చూడండి.

భారత్​ భేరి: 'మోదీకి ఆ ధైర్యముందా..?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.