విశాఖలో శక్తి టీమ్ పేరుతో మహిళా పోలీసుదళాన్ని డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. 35 మంది ఉన్న శక్తి టీమ్ మొబైల్ కాప్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. 5 కార్లు, 26 హోండా యాక్టివాలతో ఈ బృందం విధులు నిర్వహిస్తుందన్న డీజీపీ... విశాఖలో డ్రగ్స్ ఘటన కలచివేసిందని... ఎంతో ఆవేదన చెందానన్నారు. ప్రశాంతమైన విశాఖలో ఇలాంటి సంస్కృతి రాకుండా చర్యలు తీసుకుంటామన్న ఠాకూర్... డ్రగ్స్ నివారణకు ఫోన్ నెంబర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహించే స్టార్ హోటల్స్‌పైనా కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి...