పోలింగ్‌ను ఏవిధంగా ఆలస్యం చేయొచ్చో ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ చేసి చూపిందాని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెదేపాకు బలమైన పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఎక్కువగా మొరాయించాయని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఓటర్లు ఓపిగ్గా ఓటుహక్కు వినియోగించుకున్నారని దేవినేని అన్నారు. అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి మరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడారని కొనియాడారు.
దేశ రాజధానిలో చంద్రబాబు పోరాటం తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. పోలింగ్ శాతాన్ని దెబ్బతీయాలన్న కుట్రలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని దేవినేని అన్నారు. ఈవీఎంలపై చర్చ తప్పించుకునేందుకు సీఈసీ సాకులు వెదుకుతోంది ఆరోపించారు.
31కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయి ఫిర్యాదులపై వెంటనే స్పందించే సీఈసీ... ఓ కేసు ఉందనే కారణంతో వేమూరి హరిప్రసాద్‌ను ఎలా చర్చకు వద్దంటున్నారని ప్రశ్నించారు. ఈవీఎంలలో ఉన్న లోపాలు చూపినందుకే వేమూరిపై కేసు పెట్టారన్నారు.
ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాకూ జగన్ న్యాయం చేయలేకపోయారని దేవినేని ఎద్దేవా. అసెంబ్లీలో ఎలాంటి చర్చల్లో పాల్గొనని ఇలాంటి నేతలు అవసరమా అని ప్రశ్నించారు. పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ను భ్రమల్లో ఉంచుతోందని... జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పరాకాష్ట అని ఆరోపించారు.
ఇదీ చదవండి