వ్యవసాయ, సహకార శాఖ మంత్రిగా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలు దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. రైతులకు ఇచ్చిన మాటను నిజం చేస్తున్నామని పేర్కొన్నారు. కర్షకులను ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణనిధిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. సహకార సొసైటీల ఆధునీకరణ కోసం 120 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాల చలామణిని అరికట్టి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కౌలు రైతులకు రుణాలు, రాయితీలు, బీమా సౌకర్యంతో పాటు పంటలపై హక్కులు కల్పిస్తామన్నారు.
ఇదీచదవండి