భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేపు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనకు సంబంధించి శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి లోటు పాట్లకు ఆస్కారం లేకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం విజయవాడ చేరుకోనున్న ఉపరాష్ట్రపతి నూజివీడు ఐఐఐటిలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ విద్యార్ధులతో సమావేశం కానున్నారు. 15వ తేది ఉదయం 9.30 నుంచి 10.45 గంటల వరకు స్వర్ణభారతీ ట్రస్ట్ లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాదు బయలుదేరి వెళ్ళనున్నారు.
ఇదీ చదవండి