సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉదయం సమీక్ష నిర్వహించారు. పట్టణ, గ్రామీణ గృహాల నిర్మాణం, ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లలో అక్రమాలు, అవినీతిపైనా ప్రధానంగా చర్చ జరిగింది. పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో షీర్‌వాల్ టెక్నాలజీ పేరుతో పేదలపై కాంట్రాక్టర్లు భారం వేశారని సీఎం ఆరోపించారు. చదరపు అడుగు రూ.1,100 అయ్యేదాన్ని 2,300కు పెంచి దోచేశారని తెలిపారు. అదే టెక్నాలజీ, అంశాలు ప్రస్తావిస్తూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాంట్రాక్టర్లను వేధించటం తమ ఉద్దేశం కాదని... ఎవరిపైనా కక్ష లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
"గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్" - BOSTHA
గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉదయం సమీక్ష నిర్వహించారు. పట్టణ, గ్రామీణ గృహాల నిర్మాణం, ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లలో అక్రమాలు, అవినీతిపైనా ప్రధానంగా చర్చ జరిగింది. పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో షీర్‌వాల్ టెక్నాలజీ పేరుతో పేదలపై కాంట్రాక్టర్లు భారం వేశారని సీఎం ఆరోపించారు. చదరపు అడుగు రూ.1,100 అయ్యేదాన్ని 2,300కు పెంచి దోచేశారని తెలిపారు. అదే టెక్నాలజీ, అంశాలు ప్రస్తావిస్తూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాంట్రాక్టర్లను వేధించటం తమ ఉద్దేశం కాదని... ఎవరిపైనా కక్ష లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ap_cdp_41_28_attn_etv_bharat_pkg_ap10041
place: prodduturu
reporter: madhusudhan
Body:ఆ
Conclusion:ఆ