ETV Bharat / state

'అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహారం'

దిల్లీలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్నికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. అణుబాంబు కంటే ఓటు శక్తిమంతమైనది అని గుర్తు చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని చంద్రబాబు అన్నారు. నేడు కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందంటూ విమర్శించారు.

అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహారం: చంద్రబాబు
author img

By

Published : Apr 14, 2019, 12:36 PM IST

అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహారం: చంద్రబాబు

దిల్లీలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులు అర్పించారు. రాజ్యంగం ఉన్నంత వరకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేడ్కర్ అని సీఎం అన్నారు. దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వలేదని... ఓటు హక్కుని ఇచ్చిన మహోన్నతుడు అంటూ వ్యాఖ్యానించారు. ఓటు వాడుకోని రాజులవుతారో... అమ్ముకుని బానిసలవుతారో నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చిన వ్యక్తి అంటూ గుర్తు చేశారు. నేడు దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని... కొంత మంది లూటీ చేసి భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్లు రద్దు చేసిన 2 వేల రూపాయల నోటు తెచ్చారని..వీటితో రాజకీయాలు నీచంగా మారాయని ఆవేదన చెందారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా తయారైందని... మోదీ ఏం చెబితే అదే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎం యంత్రాలు సరిగా పనిచేయటం లేదని, ఏపీలో ఫారం-7 దుర్వినియోగపరిస్తే కనీసం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ప్రపంచంలో ఏ దేశం ఈవీఎంలను వాడటంలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరుతున్నామన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహారిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కాల్చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి అంబేడ్కర్ అని గుర్తు చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తిని తెలుగుదేశం కొనసాగిస్తోందని...ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

Mohali (Punjab) Apr 14 (ANI): While addressing a press conference after Royal Challengers Bangalore beat Kings XI Punjab by 8 wickets, RCB player Marcus Stoinis said, "We nailed it, it's good to get 2 points and get season started. You are not going out their batting thinking that you have lost the game, We are not thinking about finals, we are thinking about get the season started come here win this game. We got 2 points and prepare for the next game, it's about each game now, good to get started we will take the next game as it comes, It's still long season."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.