ETV Bharat / state

'ప్రపంచబ్యాంక్​ నిర్ణయంపై తెదేపాది తప్పడు ప్రచారం'

చంద్రబాబు దుర్మార్గాల వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని చీఫ్​ విప్​ శ్రీకాంత్​ రెడ్డి తెలిపారు. వైస్సార్సీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. తమ పార్టీ ఫిర్యాదు మేరకు రుణం రాలేదని తెదేపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

author img

By

Published : Jul 19, 2019, 11:28 PM IST

'ప్రపంచ బ్యాంకు రుణ తిరస్కరణపై తెదేపా నేతలు తప్పడు ప్రచారం చేస్తున్నారు'

చంద్రబాబు దుర్మార్గాల వలనే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు అడిగింది చంద్రబాబేనని...ఆయనకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు నివేదికలు పంపిందన్నారు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్​ను దుర్వినియోగం చేశారని... రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని అందులో పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని నివేదికలో పొందుపరిచారని చీఫ్​​ విప్​ తెలియజేశారు. కౌలు రైతులు, రైతులను చంద్రబాబు భయాందోళనలకు గురి చేస్తున్నారని ప్రపంచ బ్యాంకు లేఖలో తెలిపిందన్నారు. దళితుల భూములను కాజేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. భూ రికార్డులను టీడీపీ నేతలు తారుమారూ చేస్తున్నారని ప్రపంచ బ్యాంక్​ ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు చేసిన దుర్మార్గాల వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని... వైస్సార్సీపీకి ఎటువంటి సంబంధం లేదని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వైస్సార్సీపీ ఫిర్యాదు మేరకు రుణం రాలేదని... టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవాలను మీడియా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఇదీ చదవండి :

శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.