ETV Bharat / state

'సమయం లేదు తమ్ముళ్లూ' - amaravathi

అభిమానం ఉంటే ఇంటికి ఆహ్వానించి భోజనం పెడతానే తప్ప... అభ్యర్ధుల ఎంపికలో రాజీపడనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్​కు రాజకీయం చేతకాకే... బిహారీ కన్సల్టెంట్​లపై ఆధారపడ్డారని ఎద్దేవా చేశారు.

అనంతపురం నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు
author img

By

Published : Mar 7, 2019, 6:00 AM IST

Updated : Mar 7, 2019, 9:46 AM IST

అనంతపురం నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని... పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి ప్రజావేదికలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్​ స్థానాల పరిధిలోని తెదేపా నేతలతో సమీక్షించిన సీఎం... సమర్ధవంతమైన నాయకత్వానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు.

తెదేపా గెలుపును ఆపేశక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు... కియా ద్వారా యువతకు ఉపాధి కల్పించామన్నారు. జిల్లాకు నీరు తీసుకొచ్చి... రైతులకళ్లల్లోసంతోషంనింపామనిఆనందం వ్యక్తం చేశారు. తాను పాదయాత్రకు శ్రీకారం చుట్టింది అనంతపురం నుంచేనని గుర్తు చేసినసీఎం... రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది అనంతపురంలోనేని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

5ఏళ్లలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశామన్న ముఖ్యమంత్రి... హంద్రినీవా... సుజల స్రవంతి పూర్తి చేస్తున్నట్టుతెలిపారు. మడకశిర వరకు నీళ్లు తీసుకెళ్లామన్నారు. కష్టాల్లోనూ అనంతపురం జిల్లా పార్టీ వెంటే ఉందన్నారు. ఆస్తులు... ప్రాణాలు పోయినా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో అందరం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్న చంద్రబాబు... జెండా దించకుండా భుజాన మోశారని కొనియాడారు.

అభ్యర్ధుల ఎంపికలో అన్నిచోట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న చంద్రబాబు... అభ్యర్థులు ఇంట్లో కూర్చుంటే కుదరదని తేల్చిచెప్పారు. ఇంటింటికి తిరిగి... చేసింది చెప్పాలన్నారు. పార్టీకి ప్రజల మద్ధతు కూడగట్టాలన్నారు. ఎన్నికల్లో మన పోటీ దుష్ట పార్టీతోనన్న సీఎం... అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల వరకు అందరి ఆలోచనలు విజయంపైనే ఉండాలన్న ముఖ్యమంత్రి... అభ్యర్ధి ఎవరైనా... విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Intro:గిరిజనులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. మార్చి 10న గుంటూరులో జరగనున్న గిరిజన కురుక్షేత్ర సభ గోడ ప్రతులను కలెక్టరేట్ వద్ద ఆవిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ పార్టీలు గిరిజనులను ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు తప్ప రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాను యూనిట్గా తీసుకొని 13 జిల్లాలలోని గిరిజనులకు టికెట్లను కేటాయించాలన్నారు. గుంటూరులో జరిగే కురుక్షేత్ర సభలో రాజకీయ పార్టీలకు గిరిజన అజెండాను తెలియజేస్తామని... తనకు ప్రాధాన్యం కల్పించే పార్టీలకే మా మద్దతు ఉంటుందని తెలిపారు.
bite: వడిత్య శంకర్ నాయక్, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no.765
భాస్కర్ రావు
Last Updated : Mar 7, 2019, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.