ETV Bharat / state

రాహుల్​ మంచి నాయకుడే.. ప్రధాని అభ్యర్థిత్వం ఫలితాల తర్వాతే - congress

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్రమోదీ కన్నా మంచి నాయకుడని .. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కితాబిచ్చారు. ? అయితే మహాకూటమి తరపున ప్రధాని అభ్యర్ధిని ఎన్నికల ఫలితాల అనంతరమే నిర్ణయిస్తామన్నారు. ఎన్డీఏను.. ఎదుర్కొవడానికి విపక్షాల ఐక్యత ముఖ్యమన్న చంద్రబాబు.. ప్రతిపక్షాల పట్టుసడలకుండా ప్రయత్నిస్తామని.. జాతీయ వార్తా ఏజన్సీ పీటీఐకి తెలిపారు. తాను ప్రధాని పదవికి పోటీపడటం లేదని చెప్పారు.

చంద్రబాబు
author img

By

Published : May 14, 2019, 6:48 PM IST

Updated : May 14, 2019, 8:20 PM IST

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే.. మహాకూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా.. జాతీయ స్థాయిలో విపక్షాలు తెరపైకి తీసుకొచ్చిన మహాకూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న చంద్రబాబు.. ప్రాంతీయ పార్టీలు సాధించిన సీట్ల ఆధారంగా.. ప్రధాని పదవికి సరైన అభ్యర్ఖిని ప్రతిపాదిస్తామన్నారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 1996లో కాంగ్రెస్​ను దూరం చేసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టుకున్న తరహా.. తప్పులను ఈసారి పునరావృతం కానీయబోమన్నారు. '272 సీట్ల మెజార్టీ సాధించాలంటే.. అందరూ కలిసికట్టుగా ఉండాలని.. ఆంక్షలు పెట్టుకుంటూ.. వెళితే ప్రయోజనం ఉండద'ని వ్యాఖ్యానించారు. బయట నుంచి కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం వల్ల 1996, 98 యునైటైడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయాయని.. ఈసారి ఆ తప్పు జరగకూడదని.. కాంగ్రెస్ కూటమిలో భాగం కావాలని అన్నారు. కూటమిలో కాంగ్రెస్ ఉంటుందని చెప్పిన ఆయన.. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై మాత్రం నేరుగా స్పందించలేదు. అయితే రాహుల్ గాంధీ "మంచినాయకుడని.. జాతీయ ప్రయోజనాల పట్ల ప్రధాని నరేంద్రమోదీ కన్నా.. ఎక్కువ బాధ్యత కలిగిన వ్యక్తి . ఎవరి మాట వినిపించుకోని మోదీ కన్నా ఎన్నో రెట్లు మెరుగు " అని కితాబిచ్చారు. ఈ ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోందని.. ఆ నిస్పృహతోనే నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారసభల్లో పుల్వామా, సర్జికల్ దాడుల గురించి మాట్లాడుతున్నారన్నారు.

ప్రధాని రేసులో లేను
ప్రధాని అభ్యర్థిత్వానికి తాను పోటీలో లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాల్లో సీట్ల సంఖ్యే ప్రధానమని.. విడిపోయిన తర్వాత.. 25సీట్లకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ నుంచి.. తాను పోటీలో ఉండే అవకాశం తక్కువ అని చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని తేల్చేశారు.

Intro:నెల్లూరు

Body:పులికాట్ సరసు

Conclusion:
Last Updated : May 14, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.