ETV Bharat / state

ఈడీ మాజీ అధికారి ఇంట్లో సీబీఐ సోదాలు - CBI RAIDS

ఈడీ మాజీ అసిస్టెంట్​ డైరెక్టర్​ బొల్లినేని శ్రీనివాస్​ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు రావడం వల్ల అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు. మొత్తం రూ.3.75 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

CBI RAIDS at home of former ED officer
author img

By

Published : Jul 10, 2019, 10:53 AM IST

ఈడీ మాజీ అధికారి ఇంట్లో సీబీఐ సోదాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రాత్రి 12 గంటల తర్వాత విచారణ పూర్తి చేసుకొని అధికారులు వెనుదిరిగారు. కూకట్​పల్లిలోని ఆయన ఇంటి నుంచి ఆదాయానికి మించి ఆస్తులు, వాటికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కోణంలో సీబీఐ దర్యాప్తు చేశారు.

రూ. 3.75కోట్ల అక్రమాస్తులు

ప్రస్తుతం జీఎస్టీ యాంటీ ఏవియేషన్ వింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడం వల్ల హైదరాబాద్‌, విజయవాడలోని ఆయన నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. మొత్తం రూ.3.75 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. సుమారు పద్నాలుగేళ్ల పాటు ఈడీలో పనిచేసిన గాంధీ.. జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తు ప్రక్రియలోనూ కీలకంగా వ్యవహరించారు.

పలు ఆరోపణలు కూడా!

గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.