ETV Bharat / state

సవాళ్ల మధ్య టేకాఫ్ ! - ఎయిర్ పోర్ట్

భోగాపురం...రాష్ట్రానికి మణిహారంగా మారబోతున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం.విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయం నిర్మించాలని 2014లోనే ప్రభుత్వం నిర్ణయించింది. 2వేల 644.7 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు.

భోగాపురం విమానాశ్రయం
author img

By

Published : Feb 14, 2019, 7:06 AM IST

భోగాపురం...రాష్ట్రానికి మణిహారంగా మారబోతున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. రాష్ట్ర విభజన అనంతరం దిల్లీ, చెన్నై, హైదరాబాద్ తరహా అంతర్జాతీయ విమానాశ్రయాని నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం... అనేక సమస్యలు అధిగమిస్తూ ముందడుగువేసింది.
ఎన్నో సవాళ్లు....
విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయం నిర్మించాలని 2014లోనే ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నిర్మాణానికి 15వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించారు స్థానికులు. వెనక్కి తగ్గిన ప్రభుత్వం రెండో దశగా 5వేల 311 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. చివరకు 2వేల 644.7 ఎకరాలతోనే సరిపెట్టుకుంది. ఇప్పటికి సేకరించిన స్థలంతోపాటు 150 ఎకరాల జిరాయితీ భూమి తీసుకోవల్సి ఉంది. మొత్తం భూమిలో 815 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. కంచేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 490ఎకరాలు, కవులవాజ పరిధిలో 165ఎకరాలు, గూడెపువలస పరిధిలో 150ఎకరాలు, ముంజేరు రెవెన్యూ పంచాయతీ పరిధిలో 10ఎకరాల భూమి సేకరించారు. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి... సమస్యల పరిష్కారానికి సర్కారు కృషి చేయటం కీలక పరిణామం. నిర్వాసిత రైతులకు పునరావసం కల్పించటం దాదాపు పూర్తైంది.

నీలి నీడల నుంచి వెలుగులు..!

undefined
నీలి నీడల నుంచి వెలుగులు...
విభజన హామీల అమలు విషయంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతరం ఏర్పడిన నేపథ్యంలో విమానాశ్రయం నిర్మాణం ఇప్పట్లో జరగదనే ప్రచారం సాగింది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు రాజీనామా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. ఇలాంటి సందేహాలన్నింటికి తెరదించాలని సంకల్పించిన సీఎం...విమానాశ్రయం నిర్మాణ శంకుస్థాపనకు ముహుర్తం పెట్టారు.
గతేడాదే కోర్టు తీర్పు
విమానాశ్రయం కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపు విషయమై గతేడాది నవంబరులోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. జిరాయితీ భూములకు చెల్లించిన ధరే ఆ భూములకు ఇవ్వాలని స్పష్టం చేసి ఊరటనిచ్చింది. ఈ తీర్పుతో భోగాపురం మండలంలో 91మంది రైతులకు మేలు చేకూరనుంది.

Intro:బోగాపురం విమానాశ్రయ శంకుస్థాపనకు ఏర్పాట్లు

Body:విజయనగరం జిల్లా భోగాపురం లో నిర్మించదలచిన అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి రేపు ఉదయం ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రణాళికలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో సభాస్థలి హెలిప్యాడ్ సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు కలెక్టర్ హరి జవహర్లాల్ ఆధ్వర్యంలో ఏర్పాట్ల పర్యవేక్షణ జరుగుతుంది

Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.