అగ్రనాయకత్వం ప్రచారం చేసినప్పటికీ....
ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పలుమార్లు వచ్చినప్పటికి కమలం వికసించలేదు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధి పనులు, ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం లోపాలనూ ప్రజల ముందుంచింది. రైల్వే జోన్ ప్రకటించినా భాజపాను నమ్మలేదు జనం.
తెదేపా ప్రచారంతో ఎదురుదెబ్బ...
ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తెలుగుదేశం భాజపాను టార్గెట్ చేసింది. హోదా ఇస్తామని చెప్పి మోదీ మాట తప్పారనే తెదేపా ప్రచారం భాజపాపై తీవ్రప్రభావం చూపింది .
ఓటు శాతంపై పెట్టుకున్న ఆశలన్నీ...
రాష్ట్రంలో విజయావకాశాలు తక్కువైనా ఓట్ల శాతం పెంచుకుందామని ఘెరంగా దెబ్బతిన్నారు కమలనాథులు. ధరావతులు దక్కించుకున్న అభ్యర్థులు పదిలోపే ఉండటం... ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టం తెలుస్తోంది. ఓట్ల శాతం విషయంలో 170 మందికిపైగా అభ్యర్థులకు 1 శాతంలోపే ఓట్లు పోలయ్యాయి.
రాష్ట్రంలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన భాజపా.... ఈ సారైనా ప్రత్యేక హోదాతోపాటు... విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తే తప్ప ఆ పార్టీని నమ్మే స్థితిలో జనం లేరనేది విశ్లేషకుల భావన.
ఇదీ చడవండీ:'కొత్త ఎంపీల్లో 43 శాతం మంది నేరచరితులే'