ETV Bharat / state

కేసీఆర్ ఇచ్చే డబ్బు, మెప్పు కోసమే జగన్ ఆరాటం! - తెదేపా అధికార ప్రతినిధి

పోలవరంపై సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ఇస్తూ... రాష్ట్రంపై వైకాపా విషం చిమ్ముతోందని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే వెయ్యి కోట్లు, మెప్పు కోసమే జగన్ పోలవరం నిర్మాణంపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని వ్యాఖ్యానించారు.

లంకా దినకర్
author img

By

Published : Mar 25, 2019, 9:33 PM IST

లంకా దినకర్
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవటమే వైకాపా, భాజపా, తెరాస లక్ష్యమని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విమర్శించారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరంపై సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ఇస్తున్నారని ఆరోపించారు. వైకాపా రాష్ట్రంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. తెరాస ఇచ్చే వెయ్యి కోట్లు, కేసీఆర్ దగ్గర మెప్పు కోసమే... సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 ముంపు మండలాలు లాక్కోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న లంకా.. పోలవరం నిర్మిస్తే తెలంగాణకు నష్టమని సాక్షి పత్రికలో కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. కావలిలో అవసరమైతే భాజపాతో జతకడతానని జగన్ అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌, జగన్‌... భాజపాకు మిత్రులేనని పీయూష్‌ గోయల్‌ అన్న మాటల్ని ప్రస్తావించారు. వైకాపా, భాజపా, తెరాస కలిసి వచ్చినా... చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Kodungallur (Kerala), Mar 25 (ANI): Last rites of Anzi Ali Bava, who was killed in heinous New Zealand mosque attack, were performed in Kerala's Kodungallur on Monday. Bava, the Kodungalloor native moved to New Zealand with her husband and she was pursuing her masters in agribusiness management at the Lincoln University. Anzi Ali Bava was killed in the shooting at the Al Noor Mosque, one of the two mosques in Christchurch that came under attack.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.