సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన తెదేపా అభ్యర్థులతో నేడు అమరావతిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. విజయావకాశాలు, ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల లోపాలు, ఈసీ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 17ఏ, 17సీ ధ్రువపత్రాల విశ్లేషణ, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీకి సహకరించినందుకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు.
ఇవీ చూడండి: ''దేశానికి మోదీతో ప్రమాదం... ఆయన అభివృద్ధి విరోధి''