ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలను అసెంబ్లీ కమిటీ హాలులో ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అధికంగా ఉన్న నేపథ్యంలో సభా సంప్రదాయాలు, ప్రశ్నోత్తరాలు, బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అసెంబ్లీ కమిటీల పాత్రపై ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
శాసనసభ నిర్వహణ విజయవంతానికి సభ్యులకు శిక్షణ అవసరమని సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. శాసనసభ వ్యవహారాలపై సభ్యులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. సభా కాలాన్ని వినియోగించుకుని.. మంచి సభ్యులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమయానికి అనుగుణంగా ఎలా మాట్లాడాలనే అంశాలపై శిక్షణ ఉంటుందని స్పీకర్ తెలిపారు.