ETV Bharat / state

కేసీఆర్‌ ఓట్లు తొలగించారు...సాక్ష్యాలున్నాయి: శివాజీ - pressmeet

చంద్రబాబును అష్ఠదిగ్బంధనం చేసి ఎన్నికల్లో ఓడించాలనే పన్నాగమే డేటా కేసు. ఈ కేసులో ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే పనిలో కొన్ని పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. మూడు విధాలుగా లాభపడాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. -శివాజీ

నటుడు శివాజీ మీడియా సమావేశం
author img

By

Published : Mar 9, 2019, 2:55 PM IST

నటుడు శివాజీ మీడియా సమావేశం
స్వతంత్ర ప్రతిపత్తి కలిగినఎన్నికల వ్యవస్థలో ఎవరైనా జోక్యం చేసుకుంటే చర్యలు తీసుకోవాల్సిందేనని నటుడు శివాజీ స్పష్టం చేశారు. ఇలాంటి జోక్యంతోనేతెలంగాణలో ఓట్ల గల్లంతు అయ్యాయని ఆరోపించారు.అధికారికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి అడగాల్సిన అవసరమేంటనిప్రశ్నించారు. తెలంగాణలో ఎస్‌ఆర్‌డీహెచ్‌ యాప్‌ తయారు చేసి... ఓట్ల తొలగించే ప్రక్రియ చేపట్టారని ధ్వజమెత్తారు.తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని శివాజీ ఆరోపించారు. ఓట్లను తొలగించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను వాడుకున్నారనేది నిజమా? కాదా? అని ప్రశ్నించారు.ఇదంతా ప్రైవేటు కంపెనీకి ఇచ్చింది నిజామా? కాదా? సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

"నమో యాప్‌లో 22 కోట్ల మంది లబ్ధిదారుల సమాచారం ఉంది...రెండు ప్రభుత్వాలు సిట్‌లు వేశాయి.. ఏమవుతుంది?..హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్‌ డేటా చోరీకి గురైతే ఎవరిని అడగాలి?..ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఓట్లు తొలగించింది మీరు కాదా?...డేటా చౌర్యం మీరు చేసి మళ్లీ మమ్మల్నే దొంగా.. దొంగా.. అంటారా. ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించుకోండి. ఏపీ ప్రజలను దొంగలని తిట్టారు.. మేమెందుకు భరించాలి. అనేక సమస్యల్లో నిర్భయంగా నిలబడ్డా.. ఎవరికీ భయపడను.కేంద్రం ఎన్నికల సంఘం తప్పు చేసింది.. నావద్ద సాక్ష్యాలు ఉన్నాయి''......శివాజీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.