ETV Bharat / state

తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ.. "జగన్ ప్రస్థానం" - amaravathi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి. తొమ్మిదేళ్లపాటు అలుపెరగని పోరు చేశారు. ఎన్నో ఒడిదొడుగులను దాటుకుంటూ... ఆంధ్రప్రదేశ్​కు సీఎంగా ఎన్నికయ్యారు. నేడు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం...

తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ.. "జగన్ ప్రస్థానం"
author img

By

Published : May 30, 2019, 12:52 PM IST

Updated : May 30, 2019, 3:40 PM IST

తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ..
తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ.. "జగన్ ప్రస్థానం"

వైఎస్ జగన్​మోహన్ రెడ్డి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2009 మే నెలలో కడప నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి పార్లమెంట్​లో అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో 2010 ఏప్రిల్‌ 9న ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈక్రమంలో కాంగ్రెస్​తో భేదాభిప్రాయాలు రావటంతో 2010 నవంబర్‌ 29న కాంగ్రెస్‌కు, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

2011లో వైకాపా స్థాపన..
తర్వాత 2011 మార్చి 11న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2011 మార్చి 12న ఇడుపులపాయలో వైకాపా జెండాను ఆవిష్కరించారు. 2011మేలో కడప లోక్‌సభ ఉపఎన్నికల్లో 5.45 లక్షల ఆధిక్యంతో వైకాపా తరఫున ఎన్నికయ్యారు. 2012 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానంలో విజయం సాధించారు. 2014లో పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప యాత్రకు ముగింపు పలికారు. ఇవాళ 12 గంటల 23 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

కుటుంబ నేపథ్యం...
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 21డిసెంబర్‌ 1972న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి- విజయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన భారతీ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు హర్షిణీరెడ్డి, వర్షారెడ్డి ఉన్నారు.

ఇష్టమైన ఆహారం...
జగన్ మితాహారి. బ్లాక్‌ టీ ఎక్కువ తీసుకుంటారు. పండ్ల రసంతో అల్పాహారం ముగిస్తారు. మధ్యాహ్నం ఒకటి, రెండు పుల్కాలతో భోజనం పూర్తి చేస్తారు. పెరుగన్నం ఎంతో ఇష్టంగా తింటారు.

ఇదీ చదవండీ: విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్

New Delhi, May 30 (ANI): Prime Minister of Bhutan Lotay Tshering arrived in New Delhi on Thursday morning. He was received by Foreign Secretary Vijay Gokhale. He is here to attend the swearing-in ceremony of Narendra Modi as the Prime Minister for second consecutive term. PM Modi will take the oath at Rashtrapati Bhavan in the evening today.
Last Updated : May 30, 2019, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.