ETV Bharat / state

నవరత్నాల అమలే అజెండాగా రూపకల్పన..!? - Buggana Rajendranath Reddy

ఎన్నికల సందర్భంగా వైకాపా హామీ ఇచ్చిన నవరత్నాల అమలే కీలకమైన అంశాలుగా... శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలిసారి వ్యయ-ఆదాయ పట్టికను శాసనసభ ముందు ఉంచుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులే నవరత్నాల అమలుకు కీలక వనరులుగా మారనున్నాయి. రూ.2లక్షల 40వేల కోట్ల మేర రాష్ట్ర ఆదాయ-వ్యయ పట్టిక ఉంటుందని అంచనా. ఇక వ్యవసాయ బడ్జెట్ 20వేల కోట్ల మేర ప్రతిపాదించే అవకాశం ఉంది.

బడ్జెట్
author img

By

Published : Jul 12, 2019, 5:38 AM IST

నవరత్నాల అమలే కీలక అజెండాగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. మొత్తం రూ.2లక్షల 40వేల కోట్ల మేర ప్రతిపాదలు ఆర్థిక శాఖ స్వీకరించింది. వైకాపా ప్రకటించిన నవరత్నాల అమలుకే దాదాపు రూ.66వేల కోట్లకు పైగా ఈ బడ్జెట్​లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్​చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

బడ్జెట్​లో కీలకంగా అమ్మఒడి కార్యక్రమానికి సుమారు రూ.4వేల 9వందల కోట్ల మేర కేటాయించే అవకాశముంది. ఫీజు రీయంబర్స్​మెంట్ పథకానికి రూ.5వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా అమలుకు రూ.7వేల 500కోట్లు, అన్ని రకాల సామాజిక పింఛన్ల పంపిణీకి రూ.15వేల కోట్ల మేర బడ్జెట్​లో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ గృహనిర్మాణం కోసం రూ.8వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. కీలకమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.6వేల 300కోట్లు కేటాయించనున్నారు. ప్రత్యేక కమిటీ సిఫార్సుల అనంతరం మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది.

జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం రూ.8వేల కోట్లు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి రూ.350 నుంచి 400కోట్ల మేర ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. పలు కార్పోరేషన్ల కోసం రూ.2 నుంచి 3వేల కోట్లు కేటాయించే అవకాశముంది. రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీకి సుమారు రూ.4వేల కోట్ల మేర కేటాయింపులు చేసినట్టు సమాచారం. మద్యాహ్న భోజన పథకానికి వెయ్యి కోట్ల మేర ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.28 నుంచి 30వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

జగన్ ప్రధాన హామీ... రైతు భరోసా పథకానికి సుమారు రూ.8వేల 500 కోట్లు ప్రతిపాదించినట్లు సమాచారం. విపత్తుల సహాయనిధికి రైతుల కోసం రూ.2వేల కోట్లు, మార్కెట్ స్థిరీకరణ నిధిగా రూ.3వేల కోట్లు ప్రతిపాదించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లు కేటాయించారు. గ్రామ సచివాలయాల నిర్మాణానికి నిధులు, గ్రామ వాలంటీర్ల నియామకం, వారి జీతభత్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు.

వ్యవసాయ మంత్రి కన్నబాబు వ్యక్తిగత కారణాల రీత్యా సభకు హాజరుకాలేక పోతుండటంతో... వ్యవసాయ బడ్జెట్​ను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ బడ్జెట్ ప్రవేశపెడతారు.

ఇదీ చదవండీ...

రుణాలిచ్చాం... ఇవిగో ఆధారాలు... జగన్ రాజీనామా చేస్తారా..? చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.