అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైకాపా, తెదేపా సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు స్పీకర్‌ను కోరారు. అచ్చెన్నాయుడికి అవకాశం ఇస్తే మాట్లాడరని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. సబ్జెక్టును త్వరగా పూర్తిచేయాలని సభాపతి అచ్చెన్నాయుడికి సూచించారు. స్పీకర్ రాసిస్తే త్వరగా పూర్తి చేస్తానని అచ్చెన్నాయుడు అనడంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతిని ఉద్దేశిస్తూ మీరు రాసిస్తే అని మాట్లాడతా అని అంబటి రాంబాబు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడి మాటలను సమర్థిస్తారా...
ఈ అంశం పై ఘాటుగా స్పందించిన సభాపతి....అచ్చెన్నాయుడి మాటలను సమర్థిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. మీరు రాసిస్తే నేను మాట్లాడుతా అని అచ్చెన్నాయుడు అనడం మంచి పద్ధతేనా? అని అన్నారు. అచ్చెన్నాయుడి మాటలను సమర్థించట్లేదని చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో రామచంద్రారెడ్డి మాటలను సమర్థిస్తారా అని.... స్పీకర్‌ను అడిగారు చంద్రబాబు. ఒకరిపైఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే సభ నడిచే పరిస్థితి ఉండదని స్పీకర్ స్పష్టం చేశారు. సభను హుందాగా నడిపేందుకు అందరూ సహకరించాలని కోరారు.