ETV Bharat / state

పేగులు చేతితో పట్టుకుని...11 కి.మీ నడిచాడు! - a person from up skipped from train and survived

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన యువకుడు బయటకు వచ్చిన పేగులను అదిమిపట్టుకుని 11 కిలోమీటర్లు నడిచి ప్రాణాలను కాపాడుకున్నాడు.

a person from up skipped from train and survived
author img

By

Published : Jul 22, 2019, 10:06 AM IST

Updated : Jul 22, 2019, 11:55 AM IST

ఉత్తరప్రదేశ్​ హుసేనాబాద్​కు చెందిన సునీల్​ చౌహాన్​, తన సోదరుడితో కలిసి సంఘమిత్ర ఎక్స్​ప్రెస్​లో నెల్లూరు జిల్లాకు కూలీ పనుల కోసం వెళ్తున్నాడు. తెలంగాణలోని వరంగల్​ సమీపంలో ఉన్న ఉప్పల్​ స్టేషన్​ దాటాక మరుగుదొడ్డి వద్దకు వచ్చిన సునీల్​ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనలో పొట్టకు గాయమై పేగులు బయటకు వచ్చాయి. చుట్టూ చీకటి ఎవరూ సాయం చేయడానికి లేకపోయినా ధైర్యం కూడగట్టుకున్నాడు. పేగులను పొట్టలోకి నెట్టి, చొక్కా విప్పి గట్టిగా కట్టుకుని రైలు పట్టాల వెంబడి నడక సాగించాడు. హసన్​పర్తికి చేరుకున్నాక... సునీల్​ను చూసిన స్టేషన్​ మాస్టర్​ సంజయ్​కుమార్​ పటేల్​ ఆంబులెన్స్​కు ఫోన్​చేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

పేగులు అదిమిపట్టుకుని...11 కి.మీ నడిచాడు!

TG_WGL_11_22_RAIL_NUNDI_JARI_PADI_YUVAKUDIKI_GAAYALU_AV_TS10132 CONTRIBUTER :D, VENU KAZIPET DIVISION ( ) ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడిన యువకుడు బయటకి వచ్చిన పేగులను అదిమి పట్టుకొని 11 కిలోమీటర్లు నడిచి ప్రాణాలను కాపాడుకున్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హుసేనాబాద్‌కు చెందిన సునీల్‌ చౌహాన్‌ (38), తన సోదరుడు ప్రవీణ్‌ చౌహాన్‌తో కలిసి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు జిల్లాకు కూలీ పనుల కోసం వెళ్తున్నారు. వరంగల్‌ స్టేషన్‌కు కాస్త ముందు వచ్చే ఉప్పల్‌ స్టేషన్‌ దాటాక మరుగుదొడ్డి వద్దకు వచ్చిన సునీల్‌ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడు. దీంతో అతని కడుపుపై గాయమై చిన్నపేగులు బయటికి వచ్చాయి. చుట్టూ చీకటి. ఎవరూ తనకు సాయం చేయడానికి లేకపోవడంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. బయటకువచ్చిన పేగులను పొట్టలోకి నెట్టి, చొక్కా విప్పి గట్టిగా కట్టుకుని రైలు పట్టాల వెంబడి నడక ప్రారంభించి... హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. సునీల్‌ను చూసిన వెంటనే స్టేషన్‌మాస్టర్‌ సంజయ్‌కుమార్‌ పటేల్‌ 108కి ఫోన్‌చేసి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Last Updated : Jul 22, 2019, 11:55 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.