ETV Bharat / state

YSRCP Leader Anarchists in Parchur: పర్చూరులో శ్రుతిమించిన అధికార అరాచకం.. విధులు నిర్వహంచాలంటే హడలిపోతున్న ప్రభుత్వాధికారులు! - Votes Remove From Voters List in AP

YSRCP Leader Anarchists in Parchur: తెలుగుదేశం కంచుకోట పర్చూరులో పాగా వేసేందుకు అధికారపార్టీ ఈసారి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రత్యర్థులపై దాడులు చేయడం.. పోలీసులనే తరిమికొట్టడంలో సిద్ధహస్తుడిగా పేరున్న ఓ అరాచక నేతకు ఇక్కడ వైఎస్సార్సీపీ కీలక పదవి కట్టబెట్టింది. అతను వచ్చింది మొదలు ప్రశాంతంగా ఉండే పర్చూరులో అలజడి మొదలైంది. పోలీసులు, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేట్ సైన్యం సాయంతో ప్రత్యర్థుల ఓట్లు తొలగించడం ప్రారంభించాడు. ఆ అరాచక నేత ఒత్తిడి తట్టుకోలేక అధికారులకు బ్రెయిన్‌స్ట్రోక్, గుండెపోటులు వస్తుండగా..ఓ సీఐ, ముగ్గురు ఎస్సైలు సస్పెండయ్యారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు.

YSRCP_Leader_Anarchists_in_Parchur
YSRCP_Leader_Anarchists_in_Parchur
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 9:53 AM IST

YSRCP Leader Anarchists in Parchur: పర్చూరులో శ్రుతిమించి పోయిన అధికార అరాచకం.. అక్కడ విధులు నిర్వహంచాలంటే హడలిపోతున్న ప్రభుత్వాధికారులు

YSRCP Leader Anarchists in Parchur : పర్చూరులో పాగా వేసేందుకు ఓ అరాచక నేత అక్రమాలకు పాల్పడుతూ దోచిన మొత్తంలో పోలీస్‌స్టేషన్లకే నెలవారీ వాటాలు పంపుతున్నాడు. ప్రైవేటు సైన్యంతో తన అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో అధికార పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు పర్చూరును మరో పుంగనూరు, మాచర్లగా మార్చేలా ఆ అరాచక నేత పావులు కదుపుతున్నాడు. అతని అండ చూసుకుని వైఎస్సార్సీపీ కిందిస్థాయి నాయకులు చెలరేగిపోతున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఒక తహసీల్దారు బ్రెయిన్‌స్ట్రోక్‌ బారినపడగా.. మరో ఉద్యోగి గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్నారంటే ఆ నేత ఏ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారో స్పష్టమవుతోంది.

Votes Remove From Voters List in Parchur : తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న పర్చూరులో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని అరాచకాలకు మారుపేరుగా నిలిచిన ఆ కీలక నేతను అక్కడకు తీసుకొచ్చారు. ప్రత్యర్థుల ఓట్లు తొలగించేలా పక్కాగా ప్రణాళిక అమలు చేశారు. ఓటరు జాబితాను వైఎస్సార్సీపీ ఓట్ల జాబితాగా మార్చేసే స్థాయిలో అక్రమాలకు తెరతీశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు ఓ ప్రైవేట్ సైన్యాన్నే ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారితో 14 వేలకు పైగా ఫారం-7 దరఖాస్తులను సిద్ధం చేయించారు.

Removal Votes in Parchur: పర్చూరు ఓట్ల దొంగలపై చర్యలకు అధికారులు మీనమేషాలు

న్యాయస్థానం ఆదేశాలు.. ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు సస్పెండ్ : గుర్తు తెలియని ఒక వ్యక్తి 18 సిమ్‌ కార్డులు వినియోగించి ఫారం-7 దరఖాస్తులను నమోదు చేసినట్లు ఈఆర్వో మూడు రోజుల కిందట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఫారం-7లలో ఇచ్చిన ఓట్లన్నింటినీ తొలగించారా లేదా అని చూసే బాధ్యతను ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలకు అప్పగించారంటే ఆ నాయకుడు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటరు జాబితా సవరణలో అక్రమాల వ్యవహారం హైకోర్టుకు చేరడంతో.. న్యాయస్థానం ఆదేశాలతో ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు సస్పెండయ్యారు. దీంతో ఆ నేత ఒత్తిడితో నిబంధనలు అతిక్రమించిన అధికారులు తమపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని బిక్కుబిక్కుమంటున్నారు.

Application for Form-7 Mostly with SCs : తాను చేసే అక్రమాలకు ఎస్సీలను పావులుగా వినియోగించడం ఆ అరాచక నేతకు అలవాటు. ఇప్పుడు ఫారం-7 నకిలీ దరఖాస్తులను కూడా ఎక్కువ శాతం ఎస్సీలతోనే చేయించారు. అనంతవరంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎస్సీ ప్రతినిధి 208 ఫారం-7 దరఖాస్తులను సమర్పించినట్లు ఒక అధికారి నివేదిక సిద్ధం చేశారు. ముఖ్య నేత మనుషులు ఆ అధికారిపై ఒత్తిడి తెచ్చి 208 మంది వ్యక్తిగతంగానే దరఖాస్తులు సమర్పించినట్లుగా నివేదికను మార్పించినట్లు సమాచారం. ఒక ఎస్సీ సర్పంచి కూడా ఇలా దరఖాస్తులను సమర్పించారు. ఒక జెడ్పీటీసీ మెంబర్‌ కుటుంబ సభ్యుడు 150 దరఖాస్తులను సమర్పించినట్లు సమాచారం.

Irregularities in AP Voter List: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల జాబితాలో అక్రమాలు.. నయా ఆయుధం 'ఫామ్‌-7'తో వైసీపీ సర్కార్..

మార్టూరు తహసీల్దారు 20 రోజులకే బదిలీ : అధికారం అండ చూసుకుని ఆ నేత అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. అతని ఒత్తిడి తట్టుకోలేక యద్దనపూడి తహసీల్దార్‌ బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. బెదిరింపులకు లొంగి, ఆ నేతలు చెప్పినట్లు చేయలేక కారంచేడు తహసీల్దారు అనారోగ్యం అంటూ సెలవుపై వెళ్లారు. మార్టూరు తహసీల్దారుగా వచ్చిన అధికారిని బాధ్యతలు తీసుకున్న 20 రోజులకే అక్కడ నుంచి బదిలీ చేయించేశారు.

మూడు మండలాల పోలీస్‌స్టేషన్లలో ఎస్సై పోస్టులు ఖాళీ : పర్చూరు తహసీల్దారు కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే సీనియర్‌ అసిస్టెంట్‌ గుండెపోటుకు గురై గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పర్చూరులో కొలువు అంటేనే అధికారులు, ఉద్యోగులూ భయపడుతున్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పోలీస్‌స్టేషన్లలో ఎస్సైలు లేరు. సీఐ పోస్టూ ఖాళీనే. గతంలో మార్టూరు సర్కిల్‌లో పోస్ట్‌ కోసం అధికారులు సిఫార్సు లేఖలు పట్టుకుని ఏడాది ముందు నుంచే తిరిగేవారు.

ఇప్పుడు అటు వైపు రావడానికే ఎవరూ ఇష్టపడడం లేదు. ఇక్కడ ఈఆర్వోగా వ్యవహరిస్తున్న మెప్మా పీడీ వెంకట నారాయణను ప్రభుత్వం మూడు రోజుల క్రితం బదిలీ చేసి, ఆయన స్థానంలో వెంకటేశ్వర్లు అనే అధికారిని నియమించింది. ఆయన ఇక్కడ వచ్చేందుకు వెనకాడుతున్నట్లు సమాచారం.

Cases Filed on False Form 7 Applicants అధికార పార్టీ నయా ఆయుధం ఫారం-7! కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.