ETV Bharat / state

సముద్రతీరం చెంత.. గంజాయి తోడుగా చల్లని సాయంత్రం! ఏం జరుగుతోంది! - arrested for selling ganja in bapatla district

GANJA: రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జరుగుతుంది. బాపట్ల జిల్లా సముద్ర తీరంలో గంజాయి గుప్పుమంటుంది. అక్రమంగా తీసుకొచ్చిన గంజాయిని చిన్నచిన్న పొట్లాలుగా కట్టి విక్రయాలు జరుపుతున్నారు. గంజాయి మత్తుకు అలవాటుపడిన వారు బానిసలుగా మారి మత్తులో జోగుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా తీరంలో గంజాయి మాత్రం గుప్పుమంటోంది.

గంజాయి అక్రమ రవాణా
గంజాయి అక్రమ రవాణా
author img

By

Published : Feb 26, 2023, 11:40 AM IST

Updated : Feb 26, 2023, 4:27 PM IST

GANJA: రాష్ట్రంలో గంజాయి ఎక్కడపడితే పట్టుబడుతూనే ఉంది. గతంలో పట్టణాలు, నగరాల్లో లభించే గంజాయి.. తాజాగా మండలాలకు, పల్లెలకు పాకిింది. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జరుగుతుంది. పోలీసుల దాడుల్లో వందల కిలోలు పట్టుబడుతుంటే పోలీసుల కన్నుగప్పి వేలాది కిలోల గంజాయి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మహిళలే గంజాయి అమ్మకాల్లో పాలుపంచుకుంటున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. బాపట్ల జిల్లాలో బీచ్ వద్ద గంజాయిని పొట్లాలుగా తయారు చేసి.. మహిళలే అమ్మడం అందరిని ఆశ్చర్యాన్ని కనిగిస్తుంది. తాజాగా బాపట్ల జిల్లాలో ఇద్దరు మహిళలు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబటం.. పోలీసుల్ని ఆందోళనలో పడేసింది.

గంజాయి పొట్లాలు: బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పోలీసులు దాడులు చేశారు. వేటపాలెం రోశయ్య కాలనీలో 240 గ్రాములుగా గంజాయిని చిన్న పొట్లాలు చేసి అమ్మకాలు సాగిస్తున్న ఇద్దరు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. బచ్చుల వారిపాలెంలో ఓ ఇంట్లో చీరాల రూరల్ సీఐ మల్లి ఖార్జున రావు దాడి చేసి 5.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మల్లి ఖార్జున రావు మాట్లాడుతూ ఎస్పీ వకుల్ జిందాల్ అదేశాల మేరకు నిషేధిత గంజాయి అక్రమార్కులపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. వారాంతపు శెలవు రోజుల్లో తీరప్రాంతంలో పూర్తిగా పోలీసులు గస్తీ ఏర్పాటుచేయాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.

అధిక సంఖ్యలో సందర్శకులు: సూర్యలంక నుంచి చినగంజాం మండలం మోటుపల్లి వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరంలో గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడుగా సాగుతున్నాయి . ఇక్కడకు పర్యాటకులు నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో సందర్శనకు వస్తుంటారు. ఈ ప్రాంతాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతుంది.వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి అమ్ముతున్నారు . ముఖ్యంగా గంజాయి బారిన యువత, విద్యార్థులు, దినసరి కూలీలు పడుతున్నారు. ఈ మత్తులో ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఈ మత్తులో యువత పలు నేరాలకు పాల్పడుతోంది. పోలీసులకు తక్కువ మోతాదులో పట్టుపడుతున్నా భారీ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ గంజాయి అమ్మకాల వెనుక పెద్ద తలకాయలు ఉండటంతోనే.. రోజురోజుకు గంజాయి అమ్మకాలు జోరందుకుంటున్నాయనే అభిప్రాయం నెలకొంది.

ఇవీ చదవండి

Last Updated : Feb 26, 2023, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.