ETV Bharat / state

కానిస్టేబుళ్ల నిర్వాకం: ఆమె చేయి కొరికింది.. ఇతను చెవి కోశాడు ..

author img

By

Published : Mar 29, 2023, 6:34 PM IST

Updated : Mar 29, 2023, 7:53 PM IST

Constable Attack on Person: ఇటీవల అంగన్వాడీ ధర్నాకు తన భార్యను సాగనంపుతున్న వీఆర్వో చేయిని కోరికేసింది..ఓ మహిళా కానిస్టేబుల్. ఆ ఘటన మరువకు ముందే తాజాగా ఇలాంటి ఘటనే బాపట్ల మరొకటి వెలుగు చూసింది. తన తల్లి సర్పంచ్​కు తెలియకుండా, ఎమ్మెల్యే మీటింగ్​కు మహిళా సంఘాలను తీసుకెళ్లారనే కోపంతో మహిళా యానిమేటర్​ భర్తతో గొడవపడి.. అతని చెవిని కోసేశాడు ఓ కానిస్టేబుల్.

కానిస్టేబుళ్ల నిర్వాకం
కానిస్టేబుళ్ల నిర్వాకం

Police Constable in Bapatla district: అతను శాంతి భద్రతలు కాపాడే పోలీస్, తన తల్లి గ్రామ సర్పంచ్ గ్రామంలో వారి మాటే నడుస్తుంది. గ్రామ ప్రజలు వారికి ఎదురు చెప్పేందుకు సాహసించరు అనకున్నారేమో... వారిని కాదని.. ఎమ్మెల్యే నిర్వహించిన మీటింగ్​కోసం మహిళా సంఘాల సభ్యులను తీసుకువెళ్లారు వెలుగు యానిమేటర్. దింతో రెచ్చిపోయిన సర్పంచ్ కుమారుడు ఆ యానిమేటర్​తో గొడవకు దిగి ఆమె భర్తపై దాడి చేసి చెవిని కోసేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.

బాపట్ల జిల్లాలో ఓ కానిస్టేబుల్ వ్యక్తిపై దాడి చేసి చెవి కోసిన ఘటన కలకలం రేపింది. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెంకు చెందిన శ్రీనివాసరావుపై కానిస్టేబుల్ మహేష్ దాడికి పాల్పడ్డాడు. మొఖంపై పిడిగుద్దులు గుద్దటంతో పాటు బ్లేడ్ తో దాడి చేయటంతో కుడి చెవి కొంతమేర తెగిపోయింది. కంటి వద్ద కూడా గాయలయ్యాయి. మహేష్ పొన్నూరు పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నారు. ఆయన తల్లి శివకుమారి సంగుపాలెం సర్పంచిగా ఉన్నారు. శ్రీనివాసరావు భార్య సంకూరి కుమారి అదే గ్రామంలో వెలుగు యానిమేటర్ గా పనిచేస్తున్నారు. ఆసరా పథకం నగదు పంపిణికి సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నిర్వహించిన కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులను సంగుపాలెం నుంచి తీసుకెళ్లింది. అయితే తమకు చెప్పకుండా ఎమ్మెల్యే కార్యక్రమానికి మనుషుల్ని ఎలా తీసుకెళ్తారని సర్పంచి శివకుమారి యానిమేటర్ తో పాటు ఆమె భర్తను ప్రశ్నించారు. అధికారుల సూచన మేరకు తీసుకెళ్లామని చెప్పగా... ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సర్పంచ్ కుమారుడైన మహేష్ జోక్యం చేసుకుని శ్రీనివాసరావుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరూ వైసీపీకి చెందిన వారే కావటంతో పోలీసులు కేసు నమోదుకు వెనుకాడుతున్నట్లు సమాచారం.

'సీఎం జగన్ రుణమాఫి చేస్తున్నారని మా నియోజకవర్గ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టారు. అందుకోసం నేను గ్రామంలో మహిళా సంఘంలోని మహిళా సభ్యులను తీసుకెళ్లా. అందుకని మాపై సర్పంచ్, ఆమె కుమారుడు కక్ష కట్టి దాడి చేశారు. నా భర్త అడ్డుకుంటే ఆయనపై దాడి చేసి చెవిని కోశారు. ఈ ఘటనలో మా ఆయన చెవు తెగింపడింది. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలి. మాకు తగిన న్యాయం చేయాలి. మా భర్తపై దాడి చేసిన సర్పంచ్ కుమారుడు ప్రస్తుతం మహేష్ పొన్నూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.'- సంకూరి కుమారి, శ్రీనివాసరావు భార్య

ఈ నెల 20వ తేదీన ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్​లో లేడీ కానిస్టేబుల్​ రమాదేవితో​ వీఆర్వో అనిల్​.. వాగ్వాదానికి దిగిన ఘటనలో ఒకరు చేతిపైన కొరికితే.. మరొకరు చెంప చెల్లుమనిపించారు. ఈ గొడవ మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.

కానిస్టేబుళ్ల నిర్వాకం

ఇవీ చదవండి:

Last Updated : Mar 29, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.