ETV Bharat / state

Dense Fog: వేసవిలో దట్టమైన పొగమంచు.. దారి కనిపించక వాహనదారుల ఇబ్బందులు - dense fog in andhra pradesh

Fog in Bapatla District: బాపట్ల జిల్లా అద్దంకి, చినగంజాం ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. కొన్ని రోజులుగా ఎండలు మండుతున్న వేళ.. ఉదయం మంచు కురవడంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపించింది. దాంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులకు దారి కనిపించక ఇబ్బందులు పడ్డారు.

fog
మంచు
author img

By

Published : Apr 18, 2023, 11:27 AM IST

Dense Fog: వేసవిలో దట్టమైన పొగమంచు.. దారి కనిపించక వాహనదారుల ఇబ్బందులు

Fog in Bapatla District: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంటి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ చల్లదనం కోసం చూస్తున్నారు. ఎండల తీవ్రతకు భయపడి.. వాహనదారులు కూడా తమ వాహనాలను పక్కన ఆపి కాసేపు సేదతీరుతున్నారు. ఎండ వేడిమి తగ్గిన తరువాత.. సాయంత్రం తిరిగి పయనం అవుతున్నారు. మరి కొంతమంది ఉదయాన్నే తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు.

వేసవిలో ఎండలతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. బాపట్ల జిల్లాలో వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతంలో ఉదయం నుంచి పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. భారీగా పొగమంచు కప్పేయడంతో.. వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. వాహనాల లైట్లను వేసుకొని ప్రయాణాలు సాగించారు. దట్టంగా పొగమంచు కప్పేయడంతో.. ప్రమాదాలు జరుగుతాయేమోనని చాలా మంది వాహనదారులు.. తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుకున్నారు.

అద్దంకి పట్టణం గుండా వెళుతున్న నామ్ రహదారిపై భారీ నుంచి అతి భారీ వాహనాలు వెళుతూ ఉంటాయి. పొగమంచు కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని వాహన చోదకులు.. రహదారి పక్కన వాహనాలను నిలుపుకున్నారు. ఎదురుగా అసలు ఏ వాహనం వస్తుందో కూడా తెలియడంలేదు. ఉదయం 8 గంటల వరకూ పొగమంచు ఉంది.

ఓ వైపు మంచు.. మరో వైపు ఎండలు: ఓ వైపు ఉదయాన్నే మంచు.. తరువాత ఎండ వేడిమితో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఉదయాన్నే బయటకు వెళ్దామంటే.. పొగమంచు.. తరువాత ప్రయాణాన్ని పెట్టుకుందామంటే ఎండలు మండిపోతున్నాయని ప్రయాణికులు చెప్తున్నారు. దీంతో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వాహనాల రాకపోకలు అంతంతా మాత్రంగానే ఉంటున్నాయి.

ఇలా ఉదయం పొగమంచు మధ్యాహ్నం భానుడి ప్రతాపం మధ్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్తున్నారు. ఎండల తీవ్రత వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దినసరి కూలీలు, ఇతర అవసరాలకు బయటకు వెళ్తున్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఎండలో బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు: రాష్ట్రంలో రోజురోజుకీ ఎండలు పెరుగుతున్న క్రమంలో నిత్యావసరాలకు, ఇతర పనులకు ఉదయం, సాయత్రం సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు పనులను ఎండ తక్కవగా ఉన్నప్పుడు చేసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు బయటకు రావాలని.. ఒకవేళ ఎండలో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త అవసరమంటున్నాకు. నీరు ఎక్కువగా తీసుకోవాలని, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగాలని.. వీటివల్ల ఎండదెబ్బ తగలకుండా ఉంటుందని చెప్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.