Attack For property: ఆస్తి వివాదాల కారణంగా అన్న కుమార్తెలపై దాడి చేశాడు బాబాయి. బాపట్ల పట్టణానికి చెందిన చీదేళ్ల ఓంకారం, శ్రీమన్నారాయణ అన్నదమ్ములు. ఓంకారం తన ఆస్తిని అతని కుమార్తెలైన పద్మప్రియ, స్రవంతి పేర్ల మీద రాసి రిజిస్ట్రేషన్ చేశాడు. ఇది నచ్చని అతని తమ్ముడు శ్రీమన్నారాయణ, తమ్ముడి కుమారుడు వంశీవెంకటసాయికృష్ణలు పద్మప్రియ, స్రవంతిల మీద నడిరోడ్డుపై దాడి చేశారు.
ఆస్తి తమ పేర్ల మీద రాసినప్పటి నుంచి మా బాబాయి గొడవ చేస్తున్నాడని బాధితురాలు పద్మప్రియ తెలిపింది. ఈరోజు తమపై కారం చల్లి.. కర్రలతో దాడి చేశాడన్నారు. ఆమె తలకు తీవ్రగాయం కావడంతో బాపట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మా బాబాయి వల్ల ప్రాణహాని ఉందని పద్మప్రియ పేర్కొంది.
ఇవీ చదవండి: