ETV Bharat / state

Murder: బిర్యానీ తిందామని పిలిచి.. ఆటోతో గుద్ది - andhra pradesh news

Murder: తీసుకున్న డబ్బులు చెల్లించలేదని స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు. బిర్యానీ తిందామని చెప్పి.. రమ్మని అన్నాడు. వాహనంతో ఢీకొట్టి.. హత్య చేశాడు. దాని నుంచి తప్పించుకునేందుకు.. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..?

Murder
హత్య
author img

By

Published : May 4, 2023, 3:38 PM IST

Murder: తీసుకున్న నగదు బకాయి చెల్లించలేదన్న కోపంతో యువకుడుని స్నేహితుడే వాహనంతో ఢీ కొట్టి హత్య చేశాడు. అనంతరం దాని నుంచి తప్పించుకునేందుకు.. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి కటకటాల వెనక్కి పంపిన వైనం ఇది.

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన ఓరుగంటి స్వామి హత్య కేసులో పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఏనుగు పాలానికి చెందిన నిందితుడు దావులూరి రాంబాబును అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గత నెల 10వ తేదీన ఓరుగంటి స్వామి తలకు బలమైన గాయమై, కుడి కాలు విరిగి చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడి సెల్​ఫోన్​ను పరిశీలించిన పోలీసులు.. రాంబాబు అనే వ్యక్తితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయగా రాంబాబు, స్వామి స్నేహితులు అని.. వీరిద్దరూ కలిసి ఓ రైస్ మిల్లు అద్దెకు తీసుకొని వ్యాపారం ప్రారంభించినట్లు తెలిసింది. వ్యాపారం కోసం తీసుకున్న లక్ష రూపాయల నగదును.. స్వామి తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు.

తరువాత కొంతకాలానికి రైస్ మిల్లు మూతబడింది. గతంలో ఇచ్చిన లక్ష నగదు తిరిగి ఇవ్వాలని స్వామిని.. రాంబాబు పలుమార్లు కోరాడు. అయినా సరే స్వామి ఆ నగదును ఇవ్వలేదు. దీంతో గత నెల 9వ తేదీన మరోసారి పిలిపించి నగదు అడగగా.. ఇప్పుడు ఇవ్వలేనని చెప్పడంతో స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామిని బిర్యానీ తిందామని రాంబాబు అద్దంకి తీసుకువచ్చాడు. తిన్న తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి స్వామిని ఆటోతో గుద్ది.. హత్య చేశాడు.

తప్పించుకునేందుకు..ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని నిందితుడు రాంబాబు ప్రయత్నం చేశాడు. నిందితుడు చేసిన ప్రయత్నాన్ని అద్దంకి పట్టణ పోలీసులు తిప్పికొట్టారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకున్న అద్దంకి పట్టణ సీఐ రోశయ్య, ఎస్సై సుమంధర్​వలీ, కానిస్టేబుళ్లు​ అంజమ్మ రావు, సాగర బాబును.. ఎస్పీ ప్రశంసించారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

Murder: బిర్యానీ తిందామని పిలిచి.. స్నేహితుడిని హతమార్చాడు

"ఓరుగంటి స్వామి అనే వ్యక్తి.. హైవే పైన కొంత దూరంలో ఖాళీ ప్లేస్​లో మోటార్ సైకిల్ నుంచి కిందపడి, తలకి గాయమైనట్లు ఉండటంతో.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశాం. విచారణ తరువాత.. అది హిట్ అండ్ రన్​గా చూపించారు కానీ అది ఒక మర్డర్​ అని తెలిసంది. ఈ రోజు ముద్దాయి రాంబాబును అరెస్ట్ చేసి.. రిమాండ్​కు పంపించడం జరిగింది. ఈ కేసులో మృతుడు, మద్దాయికి మధ్య డబ్బు విషయంలో తగాదాలు జరిగాయి". - వకుల్ జిందాల్, ఎస్పీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.