ETV Bharat / state

ప్రభుత్వ భూమికి కంచె.. ఆందోళనకు దిగిన రైతులు

Farmers Protest: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ప్రభుత్వ స్థలానికి కంచె వేయడంతో.. పొలాలకు దారిలేక రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ భూమిని.. కొందరు వ్యక్తులు తమ సొంత భూమిగా అమ్మకానికి పెట్టినట్లు తెలియడంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. వాటిని కూడా పలుమార్లు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో అధికారులు ప్రభుత్వ భూమి చుట్టూ రాళ్లు వేసి కంచె ఏర్పాటు చేశారు.

Farmers Protest
రైతుల ఆందోళన
author img

By

Published : Mar 13, 2023, 10:15 AM IST

ప్రభుత్వ భూమికి కంచె.. ఆందోళనకు దిగిన రైతులు

Farmers Protest: ప్రభుత్వ భూమి అంటూ పొలాలకు వెళ్లే దారిని మూసేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ దారి గుండానే పొలాలకు వెళ్తున్నామని.. ఎప్పుడు లేని విధంగా మూడు రోజుల క్రితం సర్కారు వారు సర్వే చేశారు.. ఇది ప్రభుత్వ భూమి అని చుట్టూ కంచె నిర్మించారు. 2 ఎకరాల 72 సెంట్ల భూమిని.. ప్రభుత్వ భూమి అని కంచె వేయడంతో పొలాలకు వెళ్లే రాకపోకలు ఆగిపోయాయని రైతులు ఆందోళన చేపట్టారు.

బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం పరిధిలోని ఉత్తర అద్దంకిలో సర్వే నంబర్ 19లో ప్రభుత్వ భూమి రెండు ఎకరాల 72 సెంట్లు ఉంది. దానిని కొందరు వ్యక్తులు అనధికారికంగా.. అది మా సొంత భూమి అని ఎకరా భూమి అమ్మకానికి పెట్టినట్లు రెవెన్యూ అధికారులకు తెలిసింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఆ బోర్డులు కూడా తొలగించారు. ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగినట్లు సమాచారం.

పరిస్థితిని గమనించిన అద్దంకి తహసీల్దార్ సుబ్బారెడ్డి ప్రభుత్వ భూమి చుట్టూ రాళ్లు వేసి ఇనుప తీగను చుట్టి.. లక్షా 70 వేల రూపాయల ఖర్చుతో స్థలం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో సర్వే నెంబర్ 19 ఖాళీ స్థలం గానే ఉంది. దీంతో రైతులు దారిని ఏర్పాటు చేసుకొని పొలం పనులు చేసుకోవడానికి వెళ్లేవారు. ఇప్పుడు కంచె వేయడం వల్ల ఇబ్బందిగా ఉందని స్థానిక రైతులు వాపోతున్నారు.

సర్వే నెంబర్ 19 కు పడమర వైపు ఉన్న పొలాలను ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి వెంచర్ వేసి ఇళ్ల ఫ్లాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంచర్ లోనికి వెళ్లేందుకు ప్రభుత్వ భూమిలో దారులు వేసినట్లు స్థానికులు కొంతమంది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి.. కంచె ఏర్పాటు చేసినట్లు వేశారు. కంచె వేయటం వలన పొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీంతో రైతులు తహసీల్దార్ వద్దకు వెళ్లి వారి ఇబ్బందులు వివరించి వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి.. ఈ దారి గుండానే తాము పొలాలకు వెళ్తున్నామని.. దయచేసి దారి కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ సుబ్బారెడ్డి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి దారికి ఇబ్బంది కలుగకుండా చేస్తానని.. రెండు రోజుల్లో సమస్య పరిష్కారిస్తానని తెలపడంతో రైతులు వెనుదిరిగి వెళ్లారు.

"నాకు సర్వే నెంబర్ 23లో రెండు ఎకరాల పొలం ఉంది. ఇటు వైపు నుంచే 26 సంవత్సరాలుగా వస్తూ పోతూ ఉన్నాము. ఇక్కడ ఆటోనగర్ ఏర్పాటు చేసినప్పటి నుంచీ మాకు ఇటు వైపే దారి ఇచ్చారు ప్రభుత్వం వాళ్లు. కానీ ప్రస్తుతం సడెన్​గా వచ్చి.. ఇది మా స్థలం అని ప్రభుత్వం వాళ్లు ఫెన్సింగ్ వేశారు. మాకు వరి గడ్డి బళ్లు పోవడానికి, మేత బళ్లు పోవడానికి ఇబ్బందిగా ఉంది. దయ చేసి మాకు ఎంఆర్వో గారు.. దారి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము". - శ్రీనివాసరావు, అద్దంకి

"మాకు ఉత్తర అద్దంకిలో పొలం ఉంది. మా నాన్న గారు గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. మేము ప్రస్తుతం ఉన్న ఈ రోడ్డు కూడా 26 ఏళ్ల కిందట వేశారు. ఆటో నగర్ లేఆవుట్ వేసే అప్పుడు కూడా మా పొలాలకు దారి వదిలారు. మేము ఇన్ని రోజులుగా వ్యవసాయం చేసుకుంటూ వాడుకుంటున్న రోడ్డుని.. ఈ రోజు సడెన్​గా రెవెన్యూ వాళ్లు వచ్చి.. కంచె వేశారు. దీంతో మా రాకపోకలకు ఇబ్బందిగా ఉంది". - సతీశ్‌బాబు, అద్దంకి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.