CROP HOLIDAY: కృష్ణా డెల్టా రైతులూ పంట విరామం దిశగా ఆలోచిస్తున్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడలో పంట విరామం పాటించాలని నిర్ణయించినట్లు రైతులు తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవటమే ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. పైగా పంటల బీమా రాకపోవడం, రైతు భరోసా కేంద్రాలకు అమ్మిన ధాన్యం డబ్బులు సకాలంలో రాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పంట విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గోవాడ గ్రామంలో రైతులు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశానికి రాలేకపోయిన రైతుల ఇళ్లకు వెళ్లి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. పంట విరామానికి దారి తీసిన పరిస్థితులు వివరిస్తూ..రైతులందరి సంతకాలతో రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
"మా బాధలు పట్టించుకునేవాళ్లు లేరు. పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఎలా బతకాలి. తప్పని పరిస్థితుల్లోనే పంట విరామం ప్రకటిస్తున్నాం. ఎకరానికి రూ.10 వేలు నష్టపోవాల్సిన పరిస్థితి. ఎరువుల ధరలు తగ్గించి ప్రభుత్వం ఆదుకోవాలి" -గోవాడ రైతులు
ఇవీ చదవండి: