ETV Bharat / state

మండల పరిషత్ సమావేశంలో.. వైకాపా వర్గపోరు!

CONFLICT: బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. అధికార వైకాపాకు చెందిన రెండు వర్గాలు తీవ్రస్థాయిలో గొడవపడ్డాయి. ఒక దశలో బాహాబాహీకి సిద్ధమయ్యాయి. ఓ వర్గం ఎస్పీని కలిసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది.

CONFLICT
వైకాపా వర్గపోరుకు.. వేదికైన మార్టూరు మండల పరిషత్ సమావేశం
author img

By

Published : May 30, 2022, 7:57 PM IST

CONFLICT: బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిషత్ సమావేశం.. వైకాపా వర్గపోరుకు వేదికైంది. పర్చూరు వైకాపా ఇంఛార్జ్‌ రామనాథంబాబు అనుచరుడు, వైకాపా మండల కన్వీనర్ కాలేషావలి దూషించడంటూ.. అధికార పార్టీకే చెందిన ప్రకాశం జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలు చుండి సుజ్ఞానమ్మ వర్గీయులు రెండురోజుల క్రితం ఆందోళన చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్​ను కలిసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్టూరు మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన రామనాథంబాబుని.. వ్యతిరేక వర్గం అడ్డుకుంది.

వైకాపా వర్గపోరుకు.. వేదికైన మార్టూరు మండల పరిషత్ సమావేశం

ఎస్సీలపై ఇష్టానుసారం మాట్లాడిన కన్వీనర్‌పై చర్యలు తీసుకోవాలని వాగ్వాదానికి దిగారు. రామనాథంబాబు వాహనాన్ని కదలనీయలేదు. ఓ దశలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరిస్థితి తోపులాటకు దారితీయడంతో పోలీసులు చెదరగొట్టారు. రామనాథంబాబును అక్కడి నుంచి పంపించారు. ఆగ్రహించిన సుజ్ఞానమ్మ వర్గీయులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. వైకాపా మండల కన్వీనర్ కాలేషావలిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.