TABS DISTRIBUTION : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయనుంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి ZP ఉన్నత పాఠశాలలో ట్యాబ్‌ల పంపిణీని ముఖ్యమంత్రి జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 4లక్షల 59వేల 564 మంది 8 వ తరగతి విద్యార్ధులు సహా .. వారికి బోధించే 59వేల 176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. 686 కోట్ల విలువైన 5 లక్షల 18 వేల 740 శామ్‌సంగ్ ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ట్యాబ్‌ల్లో 778 కోట్ల బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఇవీ చదవండి: