ETV Bharat / state

నేటి నుంచి మూడు రోజులపాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన - టీడీపీ వార్తలు

Chandrababu will participate in Idhem Karma Mana Rastraniki: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులపాటు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు... నేటి నుంచి జరిగే తాజా పర్యటనల్లో రైతులు, విద్యార్థులు, మైనారిటీలతో సమావేశం కానున్నారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే రోడ్డు షో, బహిరంగ సభల్లోనూ పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Idhem Karma Mana Rastraniki
Idhem Karma Mana Rastraniki
author img

By

Published : Dec 8, 2022, 10:20 AM IST

Idhem Karma Mana Rastraniki program in Guntur and Bapatla: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజులపాటు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నేడు, బాపట్ల జిల్లా బాపట్లలో రేపు, చీరాలలో 10వ తేదీన చంద్రబాబు పర్యటన సాగనుంది. గతవారం మూడు రోజుల్లో ఆరు నియోజకవర్గాలను చుట్టొచ్చిన చంద్రబాబు, ఈ వారం మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

పర్యటనల్లో భాగంగా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో అనుకున్న షెడ్యూల్ కంటే 4నుంచి 6గంటలు ఎక్కడికి అక్కడ ఆలస్యం అవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అర్ధరాత్రి దాటే వరకూ పర్యటన సాగుతున్నందున, తాజా పర్యటనలో మార్పులు చేస్తూ మూడు రోజులపాటు మూడు నియోజకవర్గాలు మాత్రమే పర్యటనలు ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెదేపా నేతలు తెలిపారు.

ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా భారీ రోడ్ షో తో రాత్రికి పొన్నూరు చేరుకుంటారు. పెదకాకాని నుంచి పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి దూళిపాళ్ల నరేంద్ర భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. నారా కోడూరులో రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పొన్నూరు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్న అనంతరం చంద్రబాబు రాత్రికి పొన్నూరులోనే బస చేస్తారు.

రేపు బాపట్ల జిల్లా.. బాపట్ల టౌన్ లో రోడ్ షో నిర్వహించడంతోపాటు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. .ఇక ఈనెల 10వ తేదీన బాపట్ల జిల్లా చీరాలలో రోడ్ షో ,బహిరంగ సభ ,ముస్లిం నేతలతో చంద్రబాబు సమావేశం ఉండనుంది. చంద్రబాబు పర్యటన ను విజయవంతం చేసేందుకు గుంటూరు, బాపట్ల జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.