ETV Bharat / state

"మందీ మార్బలంతో కాదు.. ఒక్కరే రండి.. మా సమస్యలు తెలుస్తాయి.."

బాపట్లలో ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.. "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఓ మహిళ నుంచి ఊహించని మాటలు ఎదురయ్యాయి. "మందీ మార్బలంతో కాదు.. ఒక్కరే వార్డుల్లో పర్యటిస్తే అప్పుడు మా సమస్యలు తెలుస్తాయి" అని సూచించింది.

author img

By

Published : May 28, 2022, 4:08 PM IST

Updated : May 28, 2022, 7:23 PM IST

MLA  Kona Raghupathi
MLA Kona Raghupathi

"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోన రఘుపతికి నిరసన సెగ తగిలింది. బాపట్ల పట్టణంలో ఓ ఇంటికెళ్లిన రఘుపతి.. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. దీంతో.. అసహనానికి గురైన మహిళ.. తమ సమస్యలపై గళమెత్తారు. డిప్యూటీ స్పీకర్​ను సూటిగా నిలదీశారు. "మందీ మార్బలంతో కాదు.. ఎవరూ లేకుండా ఒక్కరే జనాల్లోకి రండి. అప్పుడు మా సమస్యలు తెలుస్తాయి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్దులో పారిశుధ్యం అద్వానంగా తయారైందని.. వారానికోసారి చెత్తను తీసుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మంది మార్బలంతో కాదు.. ఒక్కరే రండి.. అప్పుడు తెలుస్తాయి...

ఇదీ చదవండి:

Last Updated : May 28, 2022, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.