RTC bus driver attacked in Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేట బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌పై ప్రయాణికురాలి బంధువులు దాడి చేశారు. విజయవాడ నుంచి వినుకొండ వెళ్తున్న బస్సులో ప్రయాణించిన ఓ మహిళ.. చిల్లర ఇచ్చే విషయంలో డ్రైవర్ అసభ్య పదజాలం వాడాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో మహిళ బంధువులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. తోటి ప్రయాణీకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపకుండా డ్రైవర్‌ను చితక బాదారు.
ఇవీ చదవండి: