ETV Bharat / state

దాడులు చేసినా డోంట్​ కేర్​.. పేదల బియ్యంతోనే అక్రమ వ్యాపారం - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Illegal Rice Business: ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నిసార్లు దాడి చేసినా వారి తీరు మారడం లేదు. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయల రేషన్ బియ్యం తరలిస్తున్నా.. అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు.. దీనికి ప్రధాన కారణం బియ్యం మాఫియాకి వెన్నుదన్నుగా అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటమే కారణమని తెలుస్తోంది.

1
1
author img

By

Published : Mar 6, 2023, 9:17 PM IST

Updated : Mar 7, 2023, 6:19 AM IST

Illegal rice trade: బాపట్ల జిల్లాలో అధికారపక్షం అండతోనే యధేచ్చగా అక్రమ బియ్యం వ్యాపారం సాగుతోంది. ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం ఎన్నిసార్లు దాడులు చేసి అక్రమ బియ్యం దందాను అడ్డుకుందామన్నా ఫలితాలనివ్వడం లేదు. అధికారపక్షనేత నల్లబజారు వ్యాపారులకు శ్రీరామరక్షగా నిలవడం చర్చనీయాంశమైంది. చిన్న కేసుల మూలంగా తేలికపాటి జరిమానాలు, శిక్షలను విధించడంతో పట్టుకున్న కొద్దిరోజులకే బయటకు వచ్చేస్తున్నారు. ఒకసారి చిక్కినవారు మళ్ళీ మళ్ళీ పట్టుబడుతున్నా ఏమాత్రం రేషన్ బియ్యం దందాను నిలువరించలేకపోవడం గమనార్హం. ఫలితంగా అక్రమ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే ఉంది.

అధికారపార్టీ ప్రజాప్రతినిధి రైస్ మిల్లులోనే..: బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో అధికారపార్టీ ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారుల దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 625 రేషన్ బియ్యం బస్తాలను పట్టుకున్నారు. ఇదే మిల్లులో రేషన్ బియ్యం పట్టుకోవడం గత నాలుగు నెలల్లో ఇది మూడోసారి... అయినా వదలకుండా బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారంటే.. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా అధికార పక్ష నేత అండ ఉన్నంతవరకూ తమను ఏమీ చేయలేరన్న ధీమా స్పష్టంగా కనపడుతోంది. అక్రమంగా బియ్యం సేకరణ, తరలింపు ఎంతటి లాభసాటి వ్యాపారమో ఇట్టే అర్ధమవుతోంది. పేదల బియ్యం అక్రమ వ్యాపారానికి ముడి సరుకుగా మారింది.

పట్టుబడిన బియ్యం
పట్టుబడిన బియ్యం

భయంలేని నల్లబజారు వ్యాపారులు..: పోలీసులు, ఇటు ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకుంటున్నా నల్లబజారు వ్యాపారులు మాత్రం భయపడటం లేదు. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయల రేషన్ బియ్యం తరలిస్తున్నా.. అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు.. దీనికి ప్రధాన కారణం బియ్యం మాఫియాకి వెన్నుదన్నుగా అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటమే కారణమని తెలుస్తోంది. రోజుకు వందలాది బస్తాలు రాష్ట్ర సరిహద్దులు దాటి పోతున్నాయి.

లాభాలిలా..: పేదలకు పంపిణీ చేసేందుకు కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.38.50 వెచ్చిస్తుంది.. లబ్దిదారులకు కిలో రూపాయి చొప్పున అందిస్తుంది. కార్డుదారుల నుండి కొందరు రేషన్ డీలర్లు కిలో 8 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. చీకటి వ్యాపారస్తులకు కిలో 12 రూపాయలు చొప్పున డీలర్లు విక్రయిస్తున్నారు. వీటిని అక్రమ వ్యాపారులు కిలో 15 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. చౌక బియ్యం అక్రమంగా రవాణా చేసేవారు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. లారీ వెళ్లే సమయంలో తమ అనుచరులను ఏర్పాటు చేసుకుని నిఘా లేదని నిర్దారించుకున్న తరువాత లారీలు బయలుదేరి నల్లబజారుకు వెళతాయి.

రైస్ మిల్లులపై దాడులతో..: కొన్ని రూఢీ సమాచారం మేరకు బాపట్ల జిల్లాలోని వేటపాలెం, కారంచేడు మండలాల్లో బియ్యం మిల్లులపై పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు. కారంచేడు మండలం స్వర్ణలో అధికారపార్టీ ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లుపై చేసిన దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 625 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో గుంటూరు, ఒంగోలు నుండి వచ్చిన అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు.

రీసైక్లింగ్ చేస్తుండగా..: విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 625 రేషన్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పర్చూరు మండలం, దేవరపల్లి తదితర గ్రామాల నుండి సేకరించిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు...దాడుల్లో రెండు వాహనాలను సీజ్ చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఒకే మిల్లులో పలుమార్లు..: ఇదే మిల్లులో గతంలో ఒకసారి 165 బస్తాలు, మరోసారి 410 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నా అక్రమ బియ్యం దందాను బెరుకు లేకుండా మళ్లీ మళ్లీ చేయడం గమనార్హం. అధికారపార్టీ పుష్కలంగా అందిస్తున్న అండదండలతో బియ్యం చీకటి వ్యాపారం జోరుగా సాగుతూనే ఉంది. పట్టుకున్న బియ్యం ఏయే ప్రాంతాలనుండి వచ్చాయన్నది విచారణలో తేలాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు.

పీడి కేసులు తప్పవు !: విచారణ అనంతరం అక్రమార్కులులపై కేసులు నమోదు చేస్తామని, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. పదేపదే రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పీడి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. వేటపాలెం మండలం పందిళ్ళపల్లి నుండి తిమ్మసముద్రం రహదారిలో చీరాల రూరల్ సీఐ మల్లిఖార్జున రావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేయగా మినీలారీలో తరలిస్తున్న 98 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సంయుక్తంగా నిఘా అవసరం..: ఏది ఏమైనా పూర్తిస్థాయిలో నిరంతరం పోలీసులు, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు సంయుక్తంగా నిఘా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. అంతేకాకుండా అక్రమంగా బియ్యం నిల్వ చేసిన రైస్ మిల్లులపై దాడులు చేసి పట్టుబడ్డ నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే కొంతవరకైనా రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Mar 7, 2023, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.